News June 30, 2024
భారత్ WC గెలవడంపై ధోనీ కామెంట్స్

టీమ్ ఇండియా టీ20 WC గెలవడంపై మాజీ కెప్టెన్ ధోనీ స్పందించారు. ‘వరల్డ్ కప్ ఛాంపియన్స్-2024, నా హార్ట్రేట్ పెరిగిపోయింది. ప్రశాంతంగా ఉండి, ఆత్మవిశ్వాసంతో మీరు చేయాలనుకున్నది చేశారు. WC అందించినందుకు భారతీయులందరి తరఫున ధన్యవాదాలు. అరే.. నా పుట్టినరోజుకు వెలకట్టలేని బహుమతి ఇచ్చినందుకు థాంక్యూ’ అని ఇన్స్టాలో పోస్ట్ పెట్టారు. జులై 7న ధోనీ బర్త్డే కాగా.. అతడి సారథ్యంలో భారత్ 2007లో T20WC గెలిచింది.
Similar News
News December 1, 2025
11 పరీక్ష కేంద్రాల్లో.. 2,412 విద్యార్థులు: కలెక్టర్

జిల్లాలోని బాపట్ల, చీరాల, రేపల్లె రెవెన్యూ డివిజన్ల పరిధిలో మొత్తం 11 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలు జరుగుతాయని కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ఈ పరీక్షలకు 2,412 మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. పరీక్షా నిర్వహణ కోసం ఫ్లయింగ్ స్క్వాడ్స్, చీఫ్ సూపరింటెండెంట్లు, రూట్ అధికారులు, కస్టోడియళ్లను నియమించాలన్నారు. ప్రతి కేంద్రంలో ఏఎన్ఎంలను నియమించామని తెలిపారు.
News December 1, 2025
ఇతిహాసాలు క్విజ్ – 83 సమాధానాలు

నేటి ప్రశ్న: శివారాధనకు సోమవారాన్ని ప్రత్యేకంగా భావిస్తారు. అందుకు కారణమేంటి?
సమాధానం: సోమవారానికి సోముడు అధిపతి. సోముడంటే చంద్రుడే. ఆ చంద్రుడిని శివుడు తన తలపై ధరిస్తాడు. అలా సోమవారం శివుడికి ప్రీతిపాత్రమైనదిగా మారింది. జ్యోతిషం ప్రకారం.. సోమవారం రోజున శివుడిని పూజిస్తే చంద్రుడి ద్వారా కలిగే దోషాలు తొలగి, మానసిక ప్రశాంతత, అదృష్టం లభిస్తాయని నమ్మకం.
<<-se>>#Ithihasaluquiz<<>>
News December 1, 2025
వ్యవసాయం కుదేలవుతుంటే చోద్యం చూస్తున్న CBN: జగన్

AP: వ్యవసాయం కుప్పకూలిపోతుంటే CM CBN రైతులను వారి విధికి వదిలేసి చోద్యం చూస్తున్నారని YCP చీఫ్ YS జగన్ మండిపడ్డారు. ‘హలో ఇండియా! AP వైపు చూడండి. అక్కడ KG అరటి ₹0.50 మాత్రమే. ఇది నిజం. రైతుల దుస్థితికిది నిదర్శనం. రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లభించడం లేదు. మా హయాంలో టన్ను అరటికి 25వేలు ఇచ్చాం. రైతులు నష్టపోకుండా ఢిల్లీకి రైళ్లు ఏర్పాటుచేశాం. కోల్డ్ స్టోరేజీలు పెట్టాం’ అని Xలో పేర్కొన్నారు.


