News July 13, 2024
శ్రీశాంత్‌పై ధోనీకి కోపమొచ్చింది: అశ్విన్

మాజీ కెప్టెన్ ధోనీ గురించి భారత బౌలర్ అశ్విన్ తన ఆత్మకథలో ఆసక్తికర విషయాన్ని తెలిపారు. ‘2010లో పోర్ట్ ఎలిజబెత్‌లో సౌతాఫ్రికాతో మ్యాచ్ ఆడుతున్నాం. నేను, శ్రీశాంత్ రిజర్వు ఆటగాళ్లం. శ్రీశాంత్ డ్రెస్సింగ్‌రూమ్‌లో ఉండిపోయాడు. తనపై ధోనీ కోపంగా ఉన్నారని చెప్పినా రాలేదు. దీంతో అతడికి భారత్‌కు టికెట్ బుక్ చేయమని మేనేజర్‌తో చెప్పమంటూ ధోనీ నాతో అన్నారు. ఆ వెంటనే శ్రీశాంత్ బయటకి వచ్చేశాడు’ అని తెలిపారు.
Similar News
News November 22, 2025
పెళ్లి చేసుకుంటున్నారా? శ్రీవారి కానుక అందుకోండిలా..

పెళ్లి చేసుకునేవారికి TTD ఓ అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది. నూతన దంపతులకు వేంకటేశ్వరస్వామి ఆశీర్వచనంతో కూడిన మహా ప్రసాదం, కల్యాణ తలంబ్రాలు, కుంకుమ, కంకణాలను ఉచితంగా పంపిస్తుంది. అందుకోసం వివాహ తొలి శుభలేఖను కార్యనిర్వహణాధికారి, టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్, తిరుపతి చిరునామాకు పంపితే చాలు. వివాహానికి ఓ నెల ముందు పత్రిక పంపితే, స్వామివారి ప్రసాదం వివాహ సమయానికి అందుతుంది.

ఆవూ దూడా ఉండగా మధ్య గుంజ ఆర్చిందట

కుటుంబ సభ్యులు లేదా దగ్గరి బంధువులు తమలో తాము గొడవపడుతున్నప్పుడు, ఆ పోట్లాటలో మధ్యలో జోక్యం చేసుకున్న వ్యక్తి నష్టపోతాడు అనే సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు. ఆవును, దూడను కట్టేసినప్పుడు వాటి మధ్య ‘గుంజ’ ఆధారంగా ఉంటుంది. ఆవు, దూడ అటూఇటూ లాక్కోవడం వల్ల వాటి బలం తట్టుకోలేక మధ్యలో ఉన్న ‘గుంజ’ విరిగిపోయినట్లుగా, ఇద్దరు వ్యక్తుల గొడవలో మూడో వ్యక్తి బలి అవుతాడని ఈ సామెత భావం.