News October 25, 2024

ఎన్నికల ప్రచారంలో ధోనీ!

image

మిస్టర్ కూల్, టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ MS ధోనీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఝార్ఖండ్‌లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన ఓటర్లకు అవగాహన కల్పిస్తారని తెలుస్తోంది. ఈసీ విజ్ఞప్తి మేరకు వీడియోను ఎన్నికల కమిషన్‌కు అందించారని క్రీడావర్గాలు పేర్కొన్నాయి. దీంతో ఓటింగ్ పర్సెంటేజ్‌ను పెంచేందుకు ఈసీ ఈ ప్రచారం చేయించనుందని సమాచారం. రాష్ట్రంలో NOV 13, 20 తేదీల్లో రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి.

Similar News

News October 25, 2024

సౌతాఫ్రికా టూర్‌కు భారత జట్టు ఇదే..

image

నవంబర్ 8 నుంచి సౌతాఫ్రికాతో జరగనున్న టీ20 సిరీస్‌కు 15 మంది సభ్యులు గల భారత జట్టును BCCI ప్రకటించింది. నవంబర్ 8, 10, 13, 15 తేదీల్లో సౌతాఫ్రికాలో మ్యాచ్‌లు జరగనున్నాయి.
జట్టు: సూర్య(కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, రింకూసింగ్, తిలక్ వర్మ, జితేశ్ శర్మ, హార్దిక్, అక్షర్, రమణ్‌దీప్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్, విజయ్‌కుమార్ వైశాక్, అవేశ్ ఖాన్, యశ్ దయాల్

News October 25, 2024

ఆస్ట్రేలియా టూర్‌కు భారత జట్టు ప్రకటన.. షమీకి నో ఛాన్స్

image

ఆస్ట్రేలియాతో జరగనున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి 18 మందితో స్క్వాడ్‌ను BCCI ప్రకటించింది. జట్టులోకి వస్తాడనుకున్న షమీకి చోటు దక్కలేదు. నితీశ్ కుమార్‌ రెడ్డి, అభిమన్యు ఈశ్వరన్ ఛాన్స్ కొట్టేశారు.
జట్టు: రోహిత్(కెప్టెన్), బుమ్రా(VC), జైస్వాల్, అభిమన్యు, రాహుల్, కోహ్లీ, పంత్, సర్ఫరాజ్, గిల్, జురెల్, అశ్విన్, జడేజా, సిరాజ్, ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, నితీశ్ కుమార్, వాషింగ్టన్ సుందర్.

News October 25, 2024

పవన్‌తో ములాఖత్ విషయాలు పంచుకున్న చంద్రబాబు

image

AP: జైలులో ఉన్న సమయంలో తనతో పవన్ కళ్యాణ్‌‌ ములాఖత్ అయినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఆ పరిస్థితుల్లో తాను ధైర్యంగానే ఉన్నానని, పవన్‌ను ధైర్యంగా ఉండాలని చెప్పినట్లు అన్‌స్టాపబుల్ షోలో పేర్కొన్నారు. కూటమి పొత్తు ప్రతిపాదన తానే తీసుకొచ్చినట్లు వెల్లడించారు. వెంటనే పవన్ ఆలోచించి ఓకే చెప్పారన్నారు. ఆ తర్వాత పవన్ కూటమి ప్రకటన చేసినట్లు గుర్తు చేశారు. అదే విజయానికి నాంది అని అన్నారు.