News May 21, 2024
కోచ్‌గా ఫ్లెమింగ్‌ను ఒప్పించే బాధ్యత ధోనీదే!

టీమ్ఇండియా హెడ్ కోచ్ పదవికి స్టీఫెన్ ఫ్లెమింగ్‌ను ఒప్పించే బాధ్యతను BCCI ధోనీకి అప్పగించినట్లు తెలుస్తోంది. 2008లో CSK కోచ్‌గా ఫ్లెమింగ్ చేరినప్పటి నుంచి ధోనీకి ఆయనతో సన్నిహిత సంబంధం ఉంది. పైగా ఆయన శిక్షణలో CSK 5 IPL టైటిళ్లు సాధించింది. ఈ రీజన్‌తోనే స్టీఫెన్‌ను ఒప్పించే బాధ్యతను BCCI ధోనీపై పెట్టినట్లు టాక్. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది. గంభీర్, పాంటింగ్ కూడా కోచ్ పదవిపై ఆసక్తిగా ఉన్నారట.
Similar News
News September 15, 2025
ఇవాళ ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

TG: రాష్ట్రంలో మరో ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది. ఇవాళ ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, హైదరాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట, సిద్దిపేటలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఇతర చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది. నిన్న రాత్రి హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో వర్షం దంచి కొట్టిన సంగతి తెలిసిందే.
News September 15, 2025
సుప్రీంకోర్టులో కోర్టు మాస్టర్ ఉద్యోగాలు

<
News September 15, 2025
తెలంగాణ అప్డేట్స్

* సెప్టెంబర్ 17ను ‘తెలంగాణ విలీన దినోత్సవం’గా నిర్వహించాలని CM రేవంత్‌కు సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని లేఖ
* ఈ నెల 17 నుంచి అక్టోబర్ 16వరకు నిర్వహించే పోషణ మాసం మహోత్సవాన్ని విజయవంతం చేయాలని మంత్రి సీతక్క పిలుపు
* బీఈడీలో రెండో విడతలో 7,441 మందికి సీట్ల కేటాయింపు. ఇవాళ కాలేజీలో రిపోర్ట్ చేయాలని అధికారుల సూచన
* ఇవాళ్టి నుంచి నాగ్‌పూర్-సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు మంచిర్యాలలో హాల్టింగ్