News September 18, 2024
వచ్చే ఏడాదిలోనూ ధోనీ IPL ఆడాలి: రైనా

భారత మాజీ కెప్టెన్ ధోనీ వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్లోనూ ఆడాలని సురేశ్ రైనా అన్నారు. దేశమంతా మహీ ఆటను చూడాలనుకుంటోందని చెప్పారు. గత సీజన్లో ఆయన మెరుగైన ప్రదర్శన చేశారని చెప్పారు. ప్రతి ప్లేయర్, కోచ్‌లు మిస్టర్ కూల్ ఆటను మరికొంత కాలం చూసి ఆస్వాదించాలని కోరుకుంటున్నట్లు రైనా తెలిపారు.
Similar News
News September 15, 2025
లిక్కర్ స్కాం: మరో ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన సిట్

మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి విజయవాడ ఏసీబీ కోర్టులో సిట్ ఇవాళ మరో ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేశ్ నాయుడు, బాలాజీకుమార్ యాదవ్, నవీన్ కృష్ణ ప్రమేయంపై వివరాలు పొందుపరిచినట్లు తెలుస్తోంది. తాజాగా దాఖలు చేసిన రెండో అనుబంధ అభియోగపత్రంతో కలిపి ఇప్పటి వరకు సిట్ మొత్తం మూడు ఛార్జ్షీట్లు దాఖలు చేసినట్లయింది.
News September 15, 2025
కాలేజీలు యథావిధిగా నడపండి: సీఎం రేవంత్

TG: కాలేజీల బకాయిలు విడతల వారీగా చెల్లించేందుకు సానుకూలంగా ఉన్నామని సీఎం రేవంత్ తెలిపారు. విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా సమ్మె నిర్ణయాన్ని విరమించుకోవాలని, కాలేజీలు యథావిధిగా నడిపించాలని యూనియన్ నాయకులను ఆయన కోరారు. కళాశాలల సమస్యలు, యాజమాన్యాలు చేస్తున్న డిమాండ్లపై సీఎంతో భట్టి, శ్రీధర్ బాబు భేటీ ముగిసింది. ఈ సాయంత్రం యూనియన్ నాయకులతో మంత్రులు చర్చించిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.
News September 15, 2025
రేపు భారత్-అమెరికా వాణిజ్య చర్చలు

భారత్, అమెరికా మధ్య రేపు వాణిజ్య చర్చలు జరగనున్నాయి. ఇందుకోసం ఇవాళ రాత్రి US చీఫ్ నెగోషియేటర్, ట్రంప్ సహాయకుడు బ్రెండన్ లించ్ భారత్ చేరుకోనున్నారు. ట్రేడ్ డీల్‌పై పరస్పరం చర్చలకు ఎదురుచూస్తున్నట్లు ట్రంప్‌తో పాటు ప్రధాని మోదీ ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే.