News September 3, 2024

ధోనీ మంచి అంపైర్ అవుతారు: అంపైర్ అనిల్

image

ఆసక్తి ఉంటే టీమ్ ఇండియా క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ మంచి అంపైర్ అవుతారని అంపైర్ అనిల్ చౌదరి అన్నారు. DRS విషయంలో ఆయన అంచనాలు చాలా దగ్గరగా ఉంటాయని చెప్పారు. ‘ధోనీ రివ్యూలకు సానుకూల నిర్ణయాలే ఎక్కువగా వస్తాయి. సహచరులు అనవసరంగా రివ్యూలకు అప్పీల్ చేయకుండా ఆపుతారు. ధోనీకి ఆటపై ఎంతో అవగాహన ఉంది. 7 గంటలు ఆయన మైదానంలో గడిపేందుకు సిద్ధమైతే బెస్ట్ అంపైర్‌గా నిలుస్తారు’ అని అనిల్ పేర్కొన్నారు.

Similar News

News November 14, 2025

చిన్నారులు, టీనేజర్లకు బీపీ.. 20 ఏళ్లలో డబుల్

image

అధిక రక్తపోటుతో బాధపడుతున్న చిన్నారులు, టీనేజర్ల సంఖ్య 20 ఏళ్లలో డబుల్ అయినట్టు వెల్లడైంది. 2000లో 3.2% ఉండగా 2020కి 6% పెరిగిందని తేలింది. 21 దేశాలకు చెందిన 4,43,000 మంది చిన్నారుల హెల్త్ రిపోర్టులను పరిశీలించినట్టు జర్నల్ ప్రచురించింది. ‘బీపీకి చికిత్స చేయించకపోతే భవిష్యత్తులో గుండె, కిడ్నీ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఒబెసిటీ ఉన్న ఐదుగురు చిన్నారుల్లో ఒకరు బీపీతో బాధపడుతున్నారు’ అని పేర్కొంది.

News November 14, 2025

ఉసిరిలో తుప్పు తెగులు – నివారణ ఎలా?

image

ఉసిరిలో తుప్పు తెగులు సోకిన చెట్ల ఆకులపై తొలుత గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. తర్వాత ఇవి తుప్పు రంగుకు మారతాయి. వాటిని మనం చేతితో ముట్టుకుంటే ఆ రంగు మన చేతికి అంటుకున్నట్లుగా అనిపిస్తుంది. ఈ తెగులు రావడం వల్ల కాయలు పక్వదశకు చేరే కంటే ముందే రాలిపోతాయి. ఈ తెగులు నివారణకు లీటరు నీటికి హెక్సాకొనజోల్ 1ml లేదా ప్రొపికొనజోల్ 1ml కలిపి చెట్టుపై పిచికారీ చేయాలి.

News November 14, 2025

డబ్బుల పంపిణీతోనే ‘జూబ్లీ’లో కాంగ్రెస్ గెలుపు: కిషన్‌రెడ్డి

image

TG: దేశ ప్రజలు కాంగ్రెస్‌కు మంగళం పాడేశారని బిహార్ ఎన్నికల ఫలితాలు తేల్చాయని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. SIRను వ్యతిరేకిస్తున్న రాహుల్ వాదనను ప్రజలు తోసిపుచ్చారన్నారు. ECIకి ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్‌లో తామెన్నడూ గెలవలేదని, ఉపఎన్నికలో కాంగ్రెస్ డబ్బులతో గెలిచిందని విమర్శించారు. EVMలపై ఆరోపణలు చేస్తున్న రాహుల్ ‘జూబ్లీ’ గెలుపుపై సమాధానం చెప్పాలన్నారు.