News September 23, 2024
IPLలో వచ్చే సీజన్ కూడా ఆడనున్న ధోనీ?

IPLలో MS ధోనీ మరిన్ని సీజన్లు ఆడాలని ఆ జట్టు అభిమానులు కోరుకుంటున్నారు. ఆయన మాత్రం ఆ విషయాన్ని మిస్టరీగా ఉంచుతున్నారు. అయితే త్వరలోనే ఫ్యాన్స్కు గుడ్న్యూస్ వచ్చేలా ఉంది. ధోనీని CSK రిటెయిన్ చేసుకోనున్నట్లు అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. దీంతో వచ్చే సీజన్ కూడా ఆయన బరిలో దిగే అవకాశం ఉంది. ఇక ధోనీతో పాటు జడేజా, గైక్వాడ్, దూబే, పతిరణను CSK రిటెయిన్ చేసుకోనున్నట్లు సమాచారం.
Similar News
News January 8, 2026
అద్దె బస్సుల యజమానుల సమ్మె నోటీసులు!

AP: RTC అద్దె బస్సుల యజమానులు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి సమ్మె నోటీసులిచ్చారు. బస్సు అద్దె పెంచాలని అందులో డిమాండ్ చేశారు. లేకపోతే ఈ నెల 12 నుంచి సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. స్త్రీశక్తితో అధిక రద్దీ వల్ల భారం పడుతోందని, అదనంగా నెలకు రూ.15-20వేల వరకు ఇవ్వాలని కోరుతున్నారు. రాష్ట్రంలో 2,500 వరకు అద్దె బస్సులుండగా, సమ్మెకు దిగితే సంక్రాంతి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి.
News January 8, 2026
అమెరికా సీజ్ చేసిన ట్యాంకర్లో ముగ్గురు ఇండియన్లు!

రష్యా జెండాతో వెళ్తున్న క్రూడాయిల్ ట్యాంకర్ను అమెరికా నిన్న <<18791945>>స్వాధీనం<<>> చేసుకున్న విషయం తెలిసిందే. అందులోని 28 మంది సిబ్బందిలో ముగ్గురు ఇండియన్లు ఉన్నట్లు తెలుస్తోంది. 17మంది ఉక్రేనియన్లు, ఆరుగురు జార్జియా పౌరులు, ఇద్దరు రష్యన్లు ఉన్నట్లు సమాచారం. వీరందరినీ US నిర్బంధించింది. సిబ్బందితో మర్యాదగా ప్రవర్తించాలని, విదేశీయులను వీలైనంత త్వరగా విడుదల చేయాలని రష్యా డిమాండ్ చేసింది.
News January 8, 2026
10pmకు రాజాసాబ్ ప్రీమియర్ షో.. అయితే!

TG: ప్రభాస్ ‘రాజాసాబ్’ ప్రీమియర్స్పై ఫ్యాన్స్కు నిరాశ తప్పేలా లేదు. ప్రీమియర్స్, టికెట్ రేట్ల పెంపుపై ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు అనుమతి రాలేదు. దీంతో హైదరాబాద్లో ఓ ప్రీమియర్ షో వేయాలని మేకర్స్ నిర్ణయించారు. రాత్రి 10 గంటలకు బాలానగర్ విమల్ థియేటర్లో షో వేయనున్నారు. దీనికి కేవలం మీడియా ప్రతినిధులనే అనుమతిస్తున్నారు. అటు ఏపీలో మాత్రం ప్రీమియర్ షోలు ప్రారంభం అవుతున్నాయి.


