News March 20, 2025
ధోనీయా మజాకా… యాడ్ వీడియో భారీ సక్సెస్

మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ చేసిన <<15801433>>యాడ్<<>> భారీ విజయం పొందిందని సదరు ఈ-సైకిల్ కంపెనీ సీఈవో కునాల్ గుప్తా ట్వీట్ చేశారు. కేవలం 24 గంటల్లోనే యాడ్ వీడియోకు 50 మిలియన్ల వ్యూస్ వచ్చినట్లు ఆయన వెల్లడించారు. ఇది మాస్టర్ స్ట్రోక్ అని, వ్యూస్ పెరుగుతుండటం చూస్తుంటే సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. కాగా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘యానిమల్’ లుక్లో తలా నటించిన విషయం తెలిసిందే.
Similar News
News March 21, 2025
తులసి మెుక్క ఇంట్లో ఉంటే కలిగే లాభాలివే..!

హిందూ సాంప్రదాయం ప్రకారం తులసి మెుక్కను లక్ష్మీదేవీ స్వరూపంగా భావిస్తారు. దోమలు, కీటకాలు వంటివి ఇంట్లోకి రాకుండా రక్షణ కల్పిస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇది ఉంటే పాజిటివ్ ఎనర్జీ. తులసి ఆకుల్ని నమిలితే జలుబు, దగ్గు వంటి వ్యాధులకు ఉపశమనం లభించడంతో పాటు జీర్ణక్రియ బాగా జరుగుతుంది. గాలి నాణ్యతను మెరుగుపరుస్తాయి, తద్వారా మంచి ఆక్సిజన్ దొరుకుతుంది. వీటి వాసన పీల్చుకుంటే ఆందోళన, ఒత్తిడి తగ్గుతుంది.
News March 21, 2025
మెగాస్టార్ చిరంజీవికి సీఎం రేవంత్ అభినందనలు

TG: UKలో జీవన సాఫల్య పురస్కారం అందుకున్న మెగాస్టార్ చిరంజీవిని CM రేవంత్ అభినందించారు. ‘లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్న ప్రముఖ నటుడు చిరంజీవిగారికి హృదయపూర్వక అభినందనలు. మీకు లభించిన ఈ గౌరవం తెలుగుజాతికి గర్వకారణం. భవిష్యత్తులో మీరు మరిన్ని శిఖరాలను అధిరోహించాలని, తెలుగు ప్రజల కీర్తి ప్రతిష్ఠలను విశ్వవేదికపై చాటిచెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని ట్వీట్ చేశారు.
News March 21, 2025
ప్రధాని విదేశీ పర్యటనల ఖర్చు రూ.258కోట్లు

ప్రధాని మోదీ విదేశీ పర్యటనల ఖర్చును కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. రాజ్యసభలో ప్రతిపక్షనేత మల్లికార్జున్ ఖర్గే ప్రధాని పర్యటనల ఖర్చును తెలపాలని కోరగా విదేశాంగ శాఖ బదులిచ్చింది. 2022 మే నుంచి 2024 డిసెంబర్ వరకూ ప్రధాని 38 విదేశీ పర్యటనలకు చేయగా రూ. 258కోట్లు ఖర్చయినట్లు తెలిపింది. 2023 జూన్లో జరిగిన అమెరికా పర్యటనకు అధికంగా రూ.22కోట్లు ఖర్చు జరిగినట్లు తెలిపింది.