News April 1, 2025
ఐపీఎల్‌లో ధోనీ స్థాయి వేరు: గేల్

ఎంఎస్ ధోనీని మాజీ క్రికెటర్ క్రిస్ గేల్ ప్రశంసలతో ముంచెత్తారు. ‘ధోనీ, సీఎస్కే భారత్‌లో ఎక్కడ ఆడినా ఆ స్టేడియం పసుపుతో నిండిపోతుంది. ఐపీఎల్‌లో ధోనీ రేంజ్ అలాంటిది. ఆయన ఏ స్థానంలో ఆడారన్నది ఎవరికీ అక్కర్లేదు. 11వ స్థానంలో వచ్చినా ఆయన ఆట చూస్తే చాలు అని ఫ్యాన్స్ భావిస్తుంటారు’ అని పేర్కొన్నారు. ధోనీ ఈ సీజన్లో 8వ స్థానంలో బ్యాటింగ్‌కు రావడంపై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే.
Similar News
News April 2, 2025
మూసీ పరిసరాల్లో నిర్మాణాలపై ఆంక్షలు

TG: మూసీ నది పరిసరాల్లో నిర్మాణాలపై రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. మూసీకి 50మీటర్ల వరకు బఫర్‌జోన్‌లో నిర్మాణాలు చేపట్టవద్దని, 50-100 మీటర్ల వరకు కొత్త అనుమతులు ఇవ్వొద్దని ఉత్తర్వులు జారీ చేసింది. ప్రణాళికరహిత అభివృద్ధి జరగకుండా DTCP, GHMC చీఫ్ ప్లానర్, HMDA ప్లానింగ్ డైరెక్టర్, మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ జేఎండీలతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది.
News April 2, 2025
IPL: గుజరాత్ టార్గెట్ 170 రన్స్

GTతో మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన RCB నిర్ణీత 20 ఓవర్లలో 169-8 స్కోర్ చేసింది. లివింగ్ స్టోన్ (54), జితేశ్ శర్మ (33) రాణించారు. కోహ్లీ (7), సాల్ట్ (14), పడిక్కల్ (4), పాటీదార్ (12) నిరాశపరిచారు. చివర్లో టిమ్ డేవిడ్ (32) మెరుపులు మెరిపించారు. GT బౌలర్లలో సిరాజ్ 3, సాయి కిశోర్ 2 వికెట్లు తీయగా, అర్షద్, ఇషాంత్, ప్రసిద్ధ్ తలో వికెట్ పడగొట్టారు.
News April 2, 2025
లాలూ కోరికను ప్రతిపక్షం తీర్చలేకపోయింది.. మేం తీరుస్తున్నాం: షా

వక్ఫ్ ఆస్తులు లూటీ కాకుండా ఉండేందుకు అత్యంత కఠినమైన చట్టాలు రావాలని ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కోరుకున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్‌సభలో గుర్తుచేశారు. ‘2013లో అప్పటి యూపీఏ సర్కారు సవరణ బిల్లును ప్లాన్ చేస్తే లాలూ స్వాగతించారు. ‘వక్ఫ్ బోర్డులో సభ్యులు చాలా భూముల్ని అమ్మేశారు. సవరణను మేం సమర్థిస్తున్నాం’ అని అన్నారు. ఆయన కోరికను మీరు నెరవేర్చలేదు. మోదీ చేశారు’ అని పేర్కొన్నారు.