News September 8, 2024
ధోని రికార్డును సమం చేసిన ధ్రువ్ జురెల్

టీమ్ ఇండియా యంగ్ ప్లేయర్, వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ దిగ్గజ ప్లేయర్ ధోని రికార్డును సమం చేశారు. దులీప్ ట్రోఫీలో ఇండియా-Bతో జరుగుతున్న మ్యాచులో ఒకే ఇన్నింగ్సులో జురెల్ ఏడు క్యాచులు అందుకున్నారు. 2004-05లో ఈ దేశవాళీ టోర్నీలో ధోని 7 క్యాచులు అందుకున్నారు. కాగా ఆ తర్వాతి స్థానాల్లో బెంజమిన్, విశ్వనాథ్ ఆరేసి క్యాచులతో ఉన్నారు.
Similar News
News January 11, 2026
బంగారం ధర రూ.2 లక్షలకు చేరనుందా?

2025లో రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం ధరలు 2026లోనూ అదే పంథా కొనసాగించవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 4,500 డాలర్లు ఉంది. ఇది మార్చి నాటికి 5,000 డాలర్లకు చేరే అవకాశాలు ఉన్నట్లు HSBC కమోడిటీ పేర్కొంది. ఇక దేశీయంగా 10 గ్రాముల బంగారం ధర ఇప్పటికే రూ.1.41 లక్షల వద్ద ఉండగా, జూన్ నాటికి రూ.2 లక్షలకు చేరే అవకాశం ఉందని తెలుస్తోంది.
News January 11, 2026
ఇరాన్ స్వేచ్ఛ కోరుకుంటోంది: ట్రంప్

ఇరాన్లో తీవ్ర <<18730445>>నిరసనలు<<>> కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ప్రజలు ఇప్పటివరకు ఎప్పుడూ లేనంతగా స్వేచ్ఛను కోరుకుంటున్నారని, వారికి సాయం చేయడానికి అమెరికా సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఆర్థిక సంక్షోభం కారణంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగుతున్న విషయం తెలిసిందే. నిరసనకారులను అణచివేయాలని ఇరాన్ ప్రభుత్వం ప్రయత్నిస్తే USA చూస్తూ ఊరుకోదని ఇప్పటికే ట్రంప్ హెచ్చరించారు.
News January 11, 2026
సంక్రాంతి సందడి.. హోటళ్లు హౌస్ఫుల్

AP: గోదావరి జిల్లాల్లో సందడి సంక్రాంతి మొదలైంది. భీమవరం, ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు, కాకినాడ, రాజమండ్రి వంటి ప్రాంతాల్లో హోటళ్లు, లాడ్జిలు హౌస్ఫుల్ అయిపోయాయి. కోడిపందేల కోసం తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి జనం తరలివస్తున్నారు. పందేల బరులు భారీగా ఏర్పాటు చేస్తున్నారు. హోటల్ యజమానులు గదుల అద్దెను మూడు రోజులకు రూ.30-60 వేలు వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది.


