News June 4, 2024

పొన్నూరులో ధూళిపాళ్ల లీడింగ్

image

AP: గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వైసీపీ ఎంపీ అభ్యర్థి కిలారు రోశయ్య వెనుకంజలో ఉన్నారు. పొన్నూరులో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్ర ముందంజలో ఉన్నారు.

Similar News

News October 9, 2024

మద్యం దుకాణాలకు దరఖాస్తుల వెల్లువ.. గడువు పొడిగింపు

image

APలో మద్యం దుకాణాల లైసెన్సులకు భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. ఈ క్రమంలో ఈ నెల 11 వరకు అప్లికేషన్ల స్వీకరణకు గడువు పొడిగించింది. నిన్న రా.9 గంటల వరకు 41,348 అప్లికేషన్లు రాగా ప్రభుత్వానికి రూ.826.96 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ నెల 14న ప్రభుత్వం లాటరీలో లైసెన్సులు సెలక్ట్ చేయనుంది. 16 నుంచి కొత్త లైసెన్స్ దారులు దుకాణాలు ప్రారంభించుకోవచ్చని తెలిపింది. అదే రోజు నుంచి కొత్త మద్యం విధానం అమల్లోకి రానుంది.

News October 9, 2024

మూలా నక్షత్రం రోజున అమ్మవారిని పూజిస్తే?

image

మూలా నక్షత్రం రోజున దుర్గమ్మ సరస్వతీ దేవి రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఇవాళ మాతను భక్తి శ్రద్ధలతో పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. బుద్ధి వికాసం కలుగుతుందని నమ్మకం. దుర్గామాత తన అంశలోని నిజ స్వరూపాన్ని సాక్షాత్కరించడమే ఈ రోజు అలంకారం ప్రత్యేకత. అమ్మవారిని తెలుపు రంగు వస్త్రాలతో అలంకరిస్తారు. ‘ఓం శ్రీ సరస్వతీ దేవియే నమ:’ అనే మంత్రాన్ని పఠించాలని పండితులు చెబుతున్నారు.

News October 9, 2024

నేడు విజయవాడ దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం

image

నేడు విజయవాడ దుర్గమ్మకు AP సీఎం చంద్రబాబు సతీసమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఇవాళ మూల నక్షత్రం కావడంతో అమ్మవారు సరస్వతీ మాతగా దర్శనమివ్వనున్నారు. ఈ క్రమంలో దుర్గమ్మను వీక్షించేందుకు ఇంద్రకీలాద్రికి 2 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. క్యూలైన్లలో నీరు, మజ్జిగ, పాలు పంపిణీ చేస్తామని మంత్రి ఆనం నారాయణ రెడ్డి తెలిపారు.