News October 15, 2024

కొవిడ్ సోకిన పిల్లలకు డయాబెటిస్ ముప్పు అధికం: పరిశోధకులు

image

కొవిడ్ సోకిన పిల్లలు, యువతలో డయాబెటిస్ వచ్చే ముప్పు చాలా ఎక్కువగా ఉందని USలోని కేస్ వెస్టర్న్ రిజర్వ్ పరిశోధకులు చేసిన అధ్యయనంలో తేలింది. 2020 జనవరి-2022 డిసెంబరు మధ్యకాలంలోని వైద్య రికార్డులను వారు పరిశీలించారు. కొవిడ్ సోకిన పిల్లలకు, సాధారణ శ్వాసకోశ సమస్యలున్న పిల్లలకు మధ్య టైప్-2 డయాబెటిస్ వ్యత్యాసాన్ని గమనించగా.. కరోనా సోకిన వారిలో తర్వాతి 6 నెలల్లోనే డయాబెటిస్ వచ్చినట్లు గుర్తించారు.

Similar News

News October 15, 2024

వయనాడ్ ఉపఎన్నిక బరిలో ప్రియాంక

image

కాంగ్రెస్ కీలక నేత ప్రియాంక గాంధీ తొలిసారి ఎన్నికల బరిలో దిగనున్నారు. వయనాడ్ స్థానానికి జరిగే ఉపఎన్నికలో ఆమె పోటీ చేయనున్నట్లు AICC తెలిపింది. అంతకుముందు ఈ స్థానంలో గెలిచిన రాహుల్ గాంధీ రాజీనామా చేయడంతో బై ఎలక్షన్ అనివార్యమైంది. కాగా NOV 13న వయనాడ్ ఉపఎన్నిక జరగనుంది. అదే నెల 23న ఓట్ల లెక్కింపు ఉంటుంది. పాలక్కడ్ నుంచి రాహుల్ మమ్కుతహిల్, చెలక్కర నుంచి రమ్య పోటీ చేస్తారని కాంగ్రెస్ పేర్కొంది.

News October 15, 2024

సీనియర్‌గా మంత్రి పదవి ఆశిస్తున్నా: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్

image

TG: కాంగ్రెస్ పార్టీలో సీనియర్‌గా తాను మంత్రి పదవి ఆశిస్తున్నట్లు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ చెప్పారు. పనిచేసే వారికి పార్టీలో గుర్తింపు లభిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. మహేశ్ గౌడ్‌కు పీసీసీ చీఫ్‌ పదవి అదే ప్రాతిపదికన ఇచ్చారని పేర్కొన్నారు. అయితే దీనిపై అంతిమ నిర్ణయం హైకమాండ్‌దేనని స్పష్టం చేశారు. పైరవీలతో మంత్రి పదవులు ఇవ్వరన్నారు.

News October 15, 2024

హైకోర్టు జడ్జిలుగా ముగ్గురు లాయర్ల పేర్లు సిఫారసు

image

AP: రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులుగా ముగ్గురు లాయర్ల పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. వారిలో కుంచం మహేశ్వరరావు, టి.చంద్ర ధనశేఖర్, చల్లా గుణరంజన్ ఉన్నారు. ఈ ప్రతిపాదనలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపిన తర్వాత ఉత్తర్వులు వెలువడనున్నాయి.