News November 17, 2024
డయాబెటిస్.. బ్రేక్‌ఫాస్ట్ మానేస్తున్నారా?
మధుమేహం ఉన్నవారు ఉదయం అల్పాహారం మానేయడం మంచిది కాదని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఉదయం ఏమీ తినకుండా మధ్యాహ్నం & రాత్రి మాత్రమే భోజనం చేయడంతో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు భారీగా పెరుగుతున్నట్లు అధ్యయనంలో వెల్లడైందని తెలిపారు. దీంతోపాటు అధిక HbA1C, ఇన్సులిన్ ప్రతిస్పందన బలహీనపడటం వంటివి జరుగుతాయన్నారు. కాబట్టి అల్పాహారం మానేయొద్దని సూచించారు. SHARE IT
Similar News
News November 17, 2024
ఆవు పేడలో నోట్ల కట్టలు
HYDలోని ఓ అగ్రో కంపెనీలో పనిచేసే గోపాల్ బెహరా సంస్థ లాకర్ నుంచి రూ.20లక్షలు తీసుకుని పరారయ్యాడు. ఆ డబ్బును ఒడిశా బాలాసోర్ జిల్లాలోని బాదమందరుని గ్రామానికి తరలించినట్లు పోలీసులు గుర్తించారు. స్థానిక పోలీసులతో కలిసి అతని అత్తమామలపై ఇంట్లో తనిఖీలు చేశారు. చివరికి ఆవు పేడ కుప్పలో నుంచి డబ్బును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామని, నిందితుని కోసం గాలిస్తున్నామని తెలిపారు.
News November 17, 2024
అణ్వాయుధాల తయారీ AIకి ఇవ్వొద్దు.. US, చైనా ఒప్పందం
AI ఊహాతీతంగా ప్రవర్తించేందుకు అవకాశం ఉన్న నేపథ్యంలో అణ్వాయుధాల తయారీ, నిర్వహణ దాని చేతిలో ఎప్పుడూ పెట్టకూడదని US, చైనా తాజాగా అంగీకరించాయి. పెరూలో జరిగిన APEC సదస్సులో ఇరు దేశాల అధ్యక్షులు భేటీ అయిన సందర్భంగా అణ్వాయుధాలను మనుషులు మాత్రమే హ్యాండిల్ చేయాలని నిర్ణయించారు. రక్షణ రంగంలో AIని బాధ్యతగా వాడాలన్న ఏకాభిప్రాయానికి వచ్చారు. ప్రస్తుతం US వద్ద 5044, చైనా వద్ద 500 అణు వార్‌హెడ్స్ ఉన్నాయి.
News November 17, 2024
చికెన్ పులుసుతో జలుబు తగ్గుతుందా?
జలుబు చేసి శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటే మసాలా దట్టించిన చికెన్ పులుసు కూర తినండి/సూప్ తాగండనే మాట తరుచూ వింటూ ఉంటాం. ఇందులో కొంత వరకు నిజం ఉందని నిపుణులు చెబుతున్నారు. కూరలో వాడే అల్లం, వెల్లుల్లి, మసాలా దినుసుల కారణంగా కొంచెం ఉపశమనం కలుగుతుందని, ముక్కు రంధ్రాలు క్లియర్ అవుతాయని పేర్కొంటున్నారు. అయితే జలుబు పూర్తిగా మటుమాయం కాదంటున్నారు.