News July 30, 2024
రాజాసాబ్ టీజర్లోనే డైలాగ్స్.. అభిమానికి మారుతి రిప్లై

రాజాసాబ్ గ్లింప్స్‌లో ప్రభాస్ లుక్, స్టైల్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో పలువురు Xలో డైరెక్టర్ మారుతిపై ప్రశంసలు కురిపించారు. ‘గ్లింప్స్‌లో ఒక్క డైలాగ్ పెట్టొచ్చు కదా అన్నా’ అని ఒకరు అడగగా, అవన్నీ టీజర్లోనే అంటూ ఆయన సమాధానమిచ్చారు. క్లాస్ మాత్రమే కాదు నాకు ఛత్రపతి, మిర్చి లాంటి మాస్ BGM కావాలని మరొకరు పోస్టు చేయగా, మారుతి ఓకే చెప్పారు.
Similar News
News January 3, 2026
ఆలివ్ ఆయిల్‌తో ఎన్నో లాభాలు

వంటల్లో ఆలివ్ ఆయిల్ చేర్చడం వల్ల ఎన్నో లాభాలున్నాయంటున్నారు నిపుణులు. ఆలివ్స్‌లో యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. గుండెకు మేలుచేసే మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు, ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటాయి. కొలెస్ట్రాల్, రక్తపోటును తగ్గిస్తాయి. గుండె ఆరోగ్యంతో పాటు కొన్నిరకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించడంలోనూ సాయపడుతాయని పలు సర్వేలు తేల్చాయి. జీర్ణ వ్యవస్థతోపాటు చర్మ ఆరోగ్యాన్నీ కాపాడుతాయి.
News January 3, 2026
‘MGNREGA బచావో సంగ్రామ్’ పేరుతో కాంగ్రెస్ పోరుబాట!

ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ ‘MGNREGA బచావో సంగ్రామ్’ను ప్రారంభిస్తున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఇది కేవలం పేరు మార్పు కాదని, గ్రామీణ పేదల హక్కులను కాలరాయడమేనని ఆయన విమర్శించారు. జనవరి 8 నుంచి దేశవ్యాప్త ఉద్యమం చేపట్టనున్నట్లు ప్రకటించారు. VB G RAM G చట్టాన్ని వెనక్కి తీసుకొని పాత పద్ధతిలోనే పథకాన్ని కొనసాగించాలన్నారు.
News January 3, 2026
మాగాణి మినుములో కాండపు ఈగ – నివారణ

మాగాణి మినుముకు చీడ పీడల సమస్య ఎక్కువ. పంటకు నష్టం చేసే పురుగుల్లో కాండపు ఈగ ఒకటి. ఇది ఎక్కువగా తొలకరి పైరును ఆశించి, కాండంలో చేరి తినటం వల్ల మొక్క ఎండిపోతుంది. దీని నివారణకు థయామిథాక్సామ్ 70 W.S. 5గ్రాములు లేక ఇమిడాక్లోప్రిడ్ 600 ఎఫ్.ఎస్. 5mlను కేజీ విత్తనానికి కలిపి తప్పనిసరిగా విత్తనశుద్ధి చేసుకోవాలి. పైరుపై దీని నివారణకు లీటరు నీటికి ఎసిఫేట్ 1గ్రా. లేక డైమిథోయేట్ 2ml కలిపి పిచికారీ చేయాలి.


