News January 17, 2025
రేపటి నుంచి డయాఫ్రమ్ వాల్ నిర్మాణం

AP: పోలవరం ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. టీ-5 ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమంతో భావర్ కంపెనీ దీన్ని నిర్మించనుంది. ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నిర్మాణం పూర్తయ్యాక ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మించాల్సి ఉంటుంది. కాగా 2016లోనే డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేపట్టారు. 2020 తర్వాత వరదలకు కొంత భాగం కొట్టుకుపోయింది.
Similar News
News October 14, 2025
పొద్దుతిరుగుడులో తెగుళ్ల నివారణకు ఇలా..

వరి కోతల తర్వాత పొద్దుతిరుగుడు పంటను సాధారణ దుక్కి పద్ధతిలో నవంబర్, డిసెంబర్ వరకు విత్తుకోవచ్చు. పంట తొలి దశలో చీడపీడలు, నెక్రోసిస్ వైరస్ తెగులు నివారణకు ఒక కిలో విత్తనానికి థయోమిథాక్సామ్ 3.గ్రా. లేదా ఇమిడాక్లోప్రిడ్ 5ML కలిపి శుద్ధి చేసుకోవాలి. ఆఖరి దుక్కిలో ఎకరాకు 2-3టన్నుల పశువుల ఎరువు వేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. అవసరాన్ని బట్టి ఎకరాకు 30KGల నత్రజని, 36KGల భాస్వరం, 12KGల పొటాషియం వేసుకోవాలి.
News October 14, 2025
విజయానికి 58 పరుగుల దూరంలో..

వెస్టిండీస్‌తో రెండో టెస్ట్ చివరి రోజు ఆట ప్రారంభమైంది. భారత్ గెలవడానికి మరో 58 రన్స్ అవసరం. దీంతో తొలి సెషన్లోనే ఇండియా విజయం సాధించే అవకాశం ఉంది. క్రీజులో రాహుల్(25), సుదర్శన్(30) ఉన్నారు. భారత్ ఈ మ్యాచులో గెలిస్తే రెండు టెస్టుల సిరీస్ క్లీన్‌స్వీప్ అవుతుంది.
News October 14, 2025
ట్రంప్‌కు 2026లోనైనా ‘శాంతి’ దక్కేనా?

8 యుద్ధాలు ఆపానని, తన కంటే అర్హుడు మరొకరు లేరని ఓ మినీ సైజ్ యుద్ధం చేసినా ట్రంప్‌కు 2025-నోబెల్ శాంతి బహుమతి దక్కలేదు. తాజాగా ఇజ్రాయెల్, పాక్ ఆయన్ను ఆ ప్రైజ్‌కు నామినేట్ చేశాయి. గడువులోగా నామినేషన్లు రాక ట్రంప్ పేరును నోబెల్ కమిటీ పరిగణనలోకి తీసుకొని విషయం తెలిసిందే. వచ్చే JAN31 వరకు గడువు ఉండటంతో 2026 రేసులో ట్రంప్ ముందున్నట్లు తెలుస్తోంది. 2026లోనైనా పీస్ ప్రైజ్ ఆయన్ను వరిస్తుందా? మీ COMMENT.