News November 27, 2024
డయాఫ్రం వాల్ ప్లాట్‌ఫాం పనులు ప్రారంభం
AP: పోలవరం ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రం వాల్ ప్లాట్‌ఫాం పనులు నిన్న ప్రారంభం అయ్యాయి. వచ్చే జనవరిలో డయాఫ్రం వాల్ నిర్మాణం చేపట్టనున్న నేపథ్యంలో ముందస్తుగా దీన్ని నిర్మిస్తున్నారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలకు మధ్య పాత డయాఫ్రం వాల్‌కు సమీపంలో దీన్ని కడుతున్నారు. డయాఫ్రం వాల్ వెడల్పు 1.5 మీటర్లు ఉంటుంది. దీన్ని ప్లాస్టిక్ కాంక్రీట్‌తో నిర్మించనున్నారు.
Similar News
News November 27, 2024
బజరంగ్ పునియాకు NADA షాక్
జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (NADA) రెజ్లర్ బజరంగ్ పునియాకు షాక్ ఇచ్చింది. డోప్ పరీక్షకు నమూనా ఇచ్చేందుకు నిరాకరించినందుకు 4 ఏళ్ల నిషేధం విధించింది. జాతీయ జట్టు ట్రయల్స్ వేళ గత మార్చి 10న డోపింగ్ టెస్టుల కోసం పునియా శాంపిల్ ఇవ్వలేదు. దీంతో ఏప్రిల్‌లో తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. దీనిపై నాడా క్రమశిక్షణ ప్యానల్‌ను బజరంగ్ ఆశ్రయించగా, విచారణలో దోషిగా తేలడంతో నిషేధం అమల్లోకి వచ్చింది.
News November 27, 2024
నేడు మోదీతో టీబీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేల భేటీ
తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇవాళ ప్రధాని మోదీతో ఢిల్లీలో భేటీ కానున్నారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత వీరంతా ప్రధానిని కలవడం ఇదే తొలిసారి. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై ప్రజాప్రతినిధులు మోదీతో చర్చించనున్నారు. భవిష్యత్తు కార్యాచరణపై ఆయన వారికి దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది.
News November 27, 2024
ALERT.. నేడు భారీ వర్షాలు
AP: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ ఇవాళ తుఫానుగా బలపడే అవకాశముందని APSDMA పేర్కొంది. దీని ప్రభావంతో నేటి నుంచి 4 రోజుల పాటు కోస్తాంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో భారీవర్షాలు కురుస్తాయని పేర్కొంది. మిగతా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేసింది.