News May 31, 2024

విజయవాడను వణికిస్తోన్న డయేరియా

image

AP: విజయవాడలో డయేరియా విజృంభిస్తోంది. ఇప్పటివరకు అతిసారంతో ఐదుగురు మరణించినట్లు తెలుస్తోంది. కృష్ణా జలాలు కలుషితం కావడంతో మొగల్రాజపురం, సింగ్ నగర్, పాయకాపురం ఏరియాల్లో వంద వరకు డయేరియా కేసులు నమోదయ్యాయి. వాంతులు, విరేచనాలతో బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే డయేరియాతో ఎలాంటి మరణాలు చోటుచేసుకోలేదని, అవి సహజ మరణాలేనని వైద్యాధికారులు చెబుతున్నారు.

Similar News

News January 20, 2025

బంగాళదుంపలు రోజూ తింటున్నారా?

image

బంగాళదుంపలను ఆహారంలో రోజు కాకుండా వారానికి రెండు, మూడు రోజులు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటికి వేడి స్వభావం ఉండటం వల్ల వాంతులు, విరేచనాలతో పాటు జీర్ణాశయ సమస్యలు వచ్చే అవకాశముందని అంటున్నారు. రక్తపోటు, మధుమేహ సమస్యలు ఉన్న వారు తినడం తగ్గించాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా వీటిని నూనెలో వేయించి తినడం కంటే ఉడకబెట్టుకొని తినడం మేలు అని చెబుతున్నారు.

News January 20, 2025

కొత్త ఫోన్‌తో ఎర.. రూ.2.8 కోట్లు టోకరా

image

బెంగళూరులో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. లాటరీలో మొబైల్ గెలుచుకున్నారంటూ ఓ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్‌కి కొరియర్‌లో ఫోన్ పంపారు. నిజమేనని నమ్మిన అతను కొత్త ఫోన్‌లో సిమ్ వేశాడు. ఇదే అదనుగా నేరగాళ్లు మొబైల్‌ను తమ అధీనంలోకి తీసుకొని ఖాతా నుంచి రూ.2.8 కోట్ల నగదు కాజేశారు. మోసపోయానని ఆలస్యంగా గ్రహించిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పోలీసులను ఆశ్రయించాడు.

News January 20, 2025

సంజయ్ రాయ్‌కి నేడు శిక్ష ఖరారు

image

కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో దోషిగా తేలిన సంజయ్ రాయ్‌కి సీల్దా కోర్టు నేడు శిక్ష ఖరారు చేయనుంది. గతేడాది AUG 9న RGకర్ మెడికల్ కాలేజీలో వైద్య విద్యార్థినిని రేప్ చేసి చంపేశారు. ఈ కేసులో అక్కడ పనిచేసే సంజయ్ రాయ్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం 3 రోజుల క్రితం కోర్టు అతడిని దోషిగా తేల్చింది. అటు దీని వెనుక మరింత మంది ఉన్నారని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.