News November 29, 2024

20 ఏళ్లుగా ముక్కులో ఉండిపోయిన పాచిక!

image

చైనాకు చెందిన షావోమా(23) అనే వ్యక్తి చాలాకాలంగా తుమ్ములు, ముక్కు దిబ్బడతో బాధపడుతున్నాడు. వైద్యులు ఎండోస్కోపీ చేయగా ముక్కులో 2 సెం.మీ సైజున్న ఓ పాచిక(డైస్)ను గుర్తించారు. తనకు మూడేళ్లున్నప్పుడు అది ముక్కులోకి వెళ్లి ఉండొచ్చని షావోమా తెలిపారు. దాని చుట్టూ కండ కూడా పెరిగిపోవడంతో వైద్యులు జాగ్రత్తగా తొలగించారు. ఇన్నేళ్లుగా ముక్కులో పాచికతో సమస్యల్లేకపోవడం అదృష్టమంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Similar News

News December 21, 2025

సడన్‌గా బయటకు సార్..! కారణమేంటి..?

image

BRS శ్రేణులు సార్ అని పిలిచే KCR చాలాకాలం తర్వాత తెలంగాణ భవన్‌కు వచ్చారు. ఇకనుంచి ప్రజల్లోనే అని ప్రకటించారు. ఆల్ ఆఫ్ సడన్ ఎంట్రీకి కారణమేంటని రాజకీయ వర్గాలు చర్చిస్తున్నాయి. ఎన్నికలై రెండేళ్లైనా బయటకు రాకుంటే తప్పుడు ప్రచారంతో ఉనికి ప్రశ్నార్థకం కావొచ్చనా? వచ్చే ఏడాది MPTC, ZPTC, GHMC ఎన్నికలు, 2028లో అసెంబ్లీ ఎన్నికలు వరుసగా ఉన్నాయనా? మీ కామెంట్?

News December 21, 2025

ఉమ్మడి ఏపీ కంటే కేసీఆర్ వల్లే ఎక్కువ అన్యాయం: రేవంత్

image

TG: కృష్ణా జలాల్లో ఏపీకి 64%, తెలంగాణకు 36% చాలని సంతకం పెట్టిన ద్రోహి KCR అని సీఎం రేవంత్ ఫైరయ్యారు. ఆ సంతకంతో 3 జిల్లాలకు మరణశాసనం రాశారని విమర్శించారు. ‘ఉమ్మడి ఏపీ కంటే కేసీఆర్ చేసిన అన్యాయమే ఎక్కువ. కాళేశ్వరం కూలినా వరి ఉత్పత్తిలో TGని అగ్రస్థానంలో నిలిపాం. కృష్ణా జలాల్లో 71% వాటా కావాలని పోరాడుతున్నాం. పదేళ్ల KCR పాలనలో ఒక్క ప్రాజెక్టూ పూర్తి కాలేదు’ అని చిట్‌చాట్‌లో మండిపడ్డారు.

News December 21, 2025

KCR నోట 15 సార్లు చంద్రబాబు పేరు!

image

చంద్రబాబు తెలంగాణకు ద్రోహం చేస్తున్నారంటూ కేసీఆర్ దాదాపు 15 సార్లు ఆయన పేరును ఉచ్చరించారు. ఆనాటి పాలమూరు దత్తత, ఆర్డీఎస్ ధ్వంసం, కృష్ణా, గోదావరి జలాలను దోచుకుంటున్నారంటూ పదేపదే ఎత్తి చూపారు. కేంద్రం మద్దతుతో చంద్రబాబు తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని ఫైరయ్యారు. పెట్టుబడుల్లోనూ టీడీపీ అధినేతపై జోకులు పేల్చారు. దీంతో మళ్లీ కేసీఆర్ సెంటిమెంటును తెరపైకి తెచ్చారా? అని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.