News August 21, 2024
భారీ పేలుడు జరిగిందిలా..

AP: ఎసెన్షియా ఫార్మా కంపెనీ.. మ.2.15 గంటలు. బీ షిఫ్ట్‌కు వచ్చినవారు, ఏ షిఫ్ట్ నుంచి వెళ్లిపోయేవారితో కంపెనీ రద్దీగా ఉంది. మూడో ఫ్లోర్లో ఉన్న రియాక్టర్ ఒక్కసారిగా పేలింది. ఆ ధాటికి అక్కడున్న వారి మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. అంతలోనే ఫస్ట్ ఫ్లోర్ శ్లాబ్ కుప్పకూలింది. శిథిలాల కింద చిక్కుకున్న ఉద్యోగుల్లో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. కొంతమంది హాహాకారాలు చేస్తూ బయటికి పరుగులు తీశారు.
Similar News
News October 21, 2025
సైబర్ క్రైమ్ గ్యాంగ్ లీడర్.. కేరాఫ్ చాయ్‌వాలా

బిహార్‌లో అభిషేక్ కుమార్ అనే చాయ్‌వాలా అంతర్రాష్ట్ర సైబర్ క్రైమ్ నెట్వర్క్ లీడర్‌గా తేలాడు. వివిధ రాష్ట్రాల్లో ఎన్నో సైబర్ నేరాలకు పాల్పడిన అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అభిషేక్ ఇంట్లో సోదాలు చేపట్టి రూ.1.05 కోట్ల నగదు, 344గ్రా. గోల్డ్, 1.75KGs సిల్వర్ సీజ్ చేశారు. 85 ATM కార్డులు, 75 బ్యాంక్ పాస్‌బుక్స్, 28 చెక్‌బుక్స్, ఆధార్ కార్డ్స్, ల్యాప్టాప్స్, ఫోన్స్, లగ్జరీ కారు స్వాధీనం చేసుకున్నారు.
News October 21, 2025
బీపీ కంట్రోల్లో ఉండాలంటే..

వయసుతో సంబంధం లేకుండా చాలామంది హై బ్లడ్ ప్రెషర్(బీపీ)తో బాధపడుతున్నారు. ఉదయమే కొన్నిరకాల డ్రింక్స్ తీసుకోవడం ద్వారా రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చు. గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకోవడం, బీట్రూట్ జ్యూస్, కొబ్బరినీళ్లు, గ్రీన్ టీ, ఉసిరి జ్యూస్ వంటి వాటిలో నిత్యం ఏదో ఒకటి తీసుకోవడం వల్ల బీపీ కంట్రోల్లో ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు.
SHARE IT
News October 21, 2025
ఇలా చేయడం అమంగళకరం

కొన్ని అలవాట్లు, చర్యలను మానకపోతే జీవితంలో అశుభాలు కలుగుతాయని మన సంస్కృతి చెబుతోంది. నాలుక తడితో బొట్టు పెట్టుకోవడం, కాళ్లు దాటి వెళ్లడం, వడ్డించినా భోజనానికి రాకపోవడం, కంచాన్ని ఒళ్లో పెట్టుకొని తినడం, కాళ్లు ఊపడం, స్నానం చేసిన తర్వాత విడిచిన దుస్తులనే వేసుకోవడం, బొట్టు పెట్టుకోకపోవడం వంటి కొన్ని పనులు దోషప్రదమని పండితులు చెబుతున్నారు. వీటిని వీడితే జీవితంలో సకల శుభాలు కలుగుతాయని అంటున్నారు.