News April 2, 2024

ఈ హామీలు చంద్రబాబు నెరవేర్చారా?: సీఎం జగన్

image

AP: 2014లో కూడా చంద్రబాబు అనే పశుపతి 3 పార్టీలతో పొత్తు పెట్టుకున్నారని, అనేక హామీలిచ్చి మోసం చేశారని సీఎం జగన్ ఫైరయ్యారు. ‘చంద్రబాబు, పవన్, మోదీ కలిసి ముఖ్యమైన హామీలంటూ ఊదరగొట్టారు. రైతులకు రుణమాఫీ, మహిళలకు డ్వాక్రా రుణాల మాఫీ చేశారా? అర్హులైన అందరికీ 3 సెంట్ల స్థలం ఇచ్చారా? ఆడబిడ్డలు పుట్టిన వెంటనే రూ.25వేలు ఇచ్చారా? ఇంటింటికీ ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఇచ్చారా?’ అని ప్రజలను ప్రశ్నించారు.

Similar News

News April 11, 2026

ఇరాన్‌కు కొత్త తలనొప్పి.. మైన్స్ దొరకట్లేదు!

image

‘హార్ముజ్’ను ఇరాన్ పూర్తిస్థాయిలో తెరవకపోవడం వెనుక ఆసక్తికర విషయాలను న్యూయార్క్ టైమ్స్ ఓ కథనంలో వెల్లడించింది. యుద్ధం ప్రారంభ దశలో IRGC మెంబర్లు స్మాల్ బోట్ల సాయంతో హార్ముజ్‌లో ఇష్టారీతిన <<19350581>>మైన్స్<<>> పెట్టారని తెలిపింది. ఇప్పుడు ఆ లొకేషన్లను ట్రాక్ చేయడం కష్టంగా మారిందని, మైన్లను తొలగించే సామర్థ్యం ఇరాన్ వద్ద లేదని పేర్కొంది. మైన్లను పెట్టడం కంటే తొలగించడం కష్టం, ఖర్చుతో కూడుకున్న పని అని వివరించింది.

News April 11, 2026

టీ కొట్టు నుంచి మాల్స్ వరకు.. ‘UPI’కి పదేళ్లు!

image

ఇండియన్ డిజిటల్ పేమెంట్స్‌కు చిరునామాగా మారిన UPIకి నేటితో పదేళ్లు. 2016లో NPCI ప్రారంభించిన ఈ వ్యవస్థ నేడు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచింది. ప్రస్తుతం 50 కోట్ల మందికి పైగా యూజర్లు, 504 బ్యాంకులు, 6.5 కోట్ల మంది వ్యాపారులతో ప్రపంచంలోనే అతిపెద్ద రిటైల్ పేమెంట్ వ్యవస్థగా అవతరించింది. టీ కొట్టు నుంచి మాల్స్ వరకు ప్రతిచోటా ఫోన్ ద్వారా సులభంగా డబ్బులు పంపేలా UPI మన జీవితాలను మార్చేసింది.

News April 11, 2026

రిస్కీ రీఎంట్రీ: 40,000kmph వేగం.. 2,760°C టెంపరేచర్

image

ఆర్టెమిస్-2 మిషన్‌లో రీఎంట్రీ అత్యంత రిస్కీ పార్ట్. 40,000kmph స్పీడ్‌తో భూవాతావరణంలోకి క్యాప్సూల్ దూసుకొచ్చింది. అప్పుడు పుట్టిన 2,760°C వేడికి ఓరియన్ క్యాప్సూల్ చుట్టూ ఎర్రటి ప్లాస్మా సెగలు కమ్మేశాయి. అప్పుడే 6 నిమిషాలు కమ్యూనికేషన్ కట్ అవ్వడంతో హ్యూస్టన్ కంట్రోల్ రూమ్‌లో టెన్షన్ పీక్స్‌కు చేరింది. హీట్ షీల్డ్ ప్రాణాలు కాపాడగా పారాచూట్లు విచ్చుకుని వ్యోమగాములు సేఫ్‌గా దిగడంతో రిలీఫ్ అయ్యారు.