News April 12, 2024
చంద్రబాబు 2014లో ఈ హామీలు అమలు చేశారా?: సీఎం జగన్

AP: 2014 ఎన్నికల్లోనూ చంద్రబాబు, దత్తపుత్రుడు, మోదీ అనేక హామీలిచ్చి మోసం చేశారని సీఎం జగన్ విమర్శించారు. ‘చంద్రబాబు రూ.87 వేల కోట్ల రుణమాఫీ చేశారా? పొదుపు సంఘాల రుణాలు రూ.14,200 కోట్లు మాఫీ చేశారా? ఆడ బిడ్డల పేరిట రూ.25వేలు బ్యాంకులో జమ చేశారా? ఇంటింటికీ ఓ ఉద్యోగం.. లేదంటే రూ.2000 చొప్పున నిరుద్యోగ భృతి ఇచ్చారా? పేదలకు ఒక్క సెంటు స్థలమైనా ఇచ్చారా?’ అని ప్రశ్నించారు.
Similar News
News March 24, 2026
నేడే గురుకుల సెట్ ఫలితాలు

TG: గురుకులాల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన TGSET-2026 ఫలితాలు ఈరోజు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 1:30 గంటలకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ రిజల్ట్స్‌ను అనౌన్స్ చేస్తారు. SC, ST, BC, జనరల్ గురుకులాల్లో 5వ తరగతితో పాటు 6 నుంచి 9వ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఈ పరీక్ష నిర్వహించారు. ఈ ఏడాది ఏకంగా 1,72,842 మంది విద్యార్థులు ఈ ఎంట్రన్స్ టెస్ట్ రాశారు. అధికారిక వెబ్‌సైట్‌లో రిజల్ట్స్ చూసుకోవచ్చు.
News March 24, 2026
వరిలో కంకి నల్లిని ఎలా నివారించాలి?

వరి పైరులో గింజ పాలుపోసుకునే దశలో కంకి నల్లి ఆశిస్తుంది. వీటి వల్ల ఆకులపై పసుపు రంగు చారలు ఏర్పడతాయి. క్రమేపీ ఇవి నల్లగా మారతాయి. గింజలపై కూడా నల్లటి మచ్చలు కనిపిస్తాయి. దీనివల్ల గింజలు పాలు పోసుకోకుండా తాలుగా మారి పంట దిగుబడి 20-30% తగ్గే అవకాశం ఉంది. కంకినల్లి నివారణకు లీటరు నీటికి ప్రొఫెనోఫాస్ 2ml లేదా స్పెరోమెసిఫిన్ 1ml కలిపి 15 రోజుల వ్యవధిలో మందుమార్చి 2 సార్లు పిచికారీ చేయాలి.
News March 24, 2026
స్కిప్పింగ్‌తో ఎన్నో లాభాలు

ప్రతిరోజు స్కిప్పింగ్ చేయడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుందంటున్నారు నిపుణులు. స్కిప్పింగ్ చేయడం వల్ల కండరాలు పటిష్ఠంగా మారతాయి. గుండె, ఊపిరితిత్తుల పనితీరు మెరుగు పడుతుంది. కాళ్లు, చేతులు, ఇతర అవయవాల మధ్య సమన్వయం చక్కగా కుదురుతుంది. తద్వారా బాడీ బ్యాలెన్స్ పెరుగుతుంది. క్యాలరీలు ఎక్కువ ఖర్చై బాడీ ఫిట్‌గా మారుతుంది. అంతేకాకుండా స్కిప్పింగ్ చేయడం ద్వారా డోపమైన్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది.


