News June 16, 2024
CM రేవంత్‌కు తెలియకుండానే జగన్ ఇంటి నిర్మాణం కూల్చేశారా?: BJP MLA

TG: హైదరాబాద్‌లోని వైఎస్ జగన్ ఇంటి ముందున్న నిర్మాణాన్ని GHMC అధికారులు కూల్చేయడంపై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సందేహాలు వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డికి తెలియకుండానే ఆ నిర్మాణాలు కూల్చివేశారా? అని ప్రశ్నించారు. కూల్చివేసిన అధికారులను ఎందుకు <<13451537>>బదిలీ<<>> చేశారని ఆయన అడిగారు. కాగా అదే ప్రాంతంలో ఉన్న ఓ సీనియర్ కాంగ్రెస్ నేత ఫిర్యాదుతోనే కూల్చివేత చేపట్టినట్లు ప్రచారం జరుగుతోంది.
Similar News
News April 3, 2026
ప్రకృతి సేద్యం ‘అగ్ని అస్త్రం’ తయారీకి కావాల్సిన పదార్థాలు

ప్రకృతి సేద్యంలో కాండం, కాయ తొలిచే పురుగులు పంటకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. ముఖ్యంగా ఆకుముడత, కాండం తొలిచే పురుగు, కాయతొలిచే పురుగు, వేరు పురుగుల నివారణకు అగ్నాస్త్రం బాగా ఉపయోగపడుతుంది. దీని తయారీకి కావాల్సిన పదార్థాలు
☛ దేశవాళీ ఆవు మూత్రం – 10 లీటర్లు ☛ పచ్చి పొగాకు – 1 కిలో ☛ పచ్చి వేపాకు 5 కిలోలు ☛ పచ్చి మిరపకాయలు 1 లేదా 2 కిలోలు ☛ వెల్లుల్లి పేస్టు – అర
News April 3, 2026
‘అగ్నాస్త్రం’ తయారీ విధానం, వినియోగం

పొగాకు, వేపాకు, పచ్చి మిరపకాయలు, వెల్లుల్లిని మెత్తగా నూరి ఒక పాత్రలో వేసి 10 లీటర్ల ఆవు మూత్రం కలపాలి. దీన్ని పొయ్యి మీద 5 పొంగులు వచ్చే వరకు ఉడికించాలి. తర్వాత పొయ్యి మీద నుంచి దించి గుడ్డ/గన్నీ సంచితో కప్పాలి. 48 గంటలు చల్లారాక వడగట్టి భద్రపరుచుకోవాలి. అవసరమైన సమయంలో ఎకరానికి 100 లీటర్ల నీటిలో 2 లేదా రెండున్నర లీటర్ల అగ్నాస్త్రం కలిపి పంటలపై పిచికారీ చేయాలి. ఇది 3 నెలల పాటు నిల్వ ఉంటుంది.
News April 3, 2026
ఎంత మంది భూ కక్ష్యను దాటి వెళ్లారో తెలుసా?

నాసా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ఆర్టెమిస్-2’ <<19542665>>ప్రయోగం<<>>లో భాగంగా నలుగురు వ్యోమగాములు చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించనున్నారు. ఇప్పటిదాకా 24 మంది మాత్రమే భూకక్ష్యను దాటి ప్రయాణించారు. వీరంతా 1968-72 మధ్య అపోలో యాత్రల్లో భాగంగా వెళ్లిన అమెరికా ఆస్ట్రోనాట్లే కావడం గమనార్హం. వీరిలో 12 మంది చంద్రుడిపై అడుగుపెట్టారు. దాదాపు 50 ఏళ్ల తర్వాత ఇప్పుడు మనుషులు చంద్రుడి కక్ష్యలోకి వెళ్తున్నారు.


