News September 22, 2024
దేవుడికి అపచారాలు చేసి మళ్లీ ఎదురుదాడా?: సీఎం

AP: గత పాలకులు తిరుమలలో చేసిన అపచారాన్ని ప్రజలు మర్చిపోరని CM చంద్రబాబు అన్నారు. ‘అన్యమతస్థులు కొండపై వ్యాపారాలు చేశారు. క్రిస్టియన్ సంప్రదాయంలో కుమార్తె పెళ్లి చేసిన భూమన కరుణాకర్‌రెడ్డిని TTD ఛైర్మన్‌ను చేశారు. కుమారుడు చనిపోతే EO ధర్మారెడ్డి కొండపైకి వెళ్లారు. దేవుడికి ఇలాంటి అపచారాలు చేసి మళ్లీ ఎదురుదాడి చేస్తారా? ‘ అని CM ప్రశ్నించారు. అపచారాలు చేసి కూడా YCP నేతలు పశ్చాత్తాపం పడటం లేదన్నారు.
Similar News
News March 14, 2026
‘శల్య సారథ్యం’ అంటే?

ఒకరిని నమ్మి కీలక బాధ్యతలు అప్పగిస్తే ప్రత్యర్థికి మేలు చేసేలా వ్యవహరించినప్పుడు ఈ జాతీయం వాడుతుంటారు. భారతంలో పాండవులకు శల్యుడు మేనమామ. అయితే దుర్యోధనుడు కుట్రతో చేసిన సత్కారానికి మెచ్చి కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులకు సాయం చేయడానికి ఒప్పుకుంటారు. తర్వాత నిజం తెలుసుకొని ధర్మరాజు వినతితో కర్ణుడి రథసారథిగా ఉంటూ సూటిపోటి మాటలతో అతని ఏకాగ్రతను దెబ్బతీసి ఓటమికి కారణమవుతారు.
<<-se>>#EPICSAYINGS<<>>
News March 14, 2026
సీఈసీని ఎలా తొలగించవచ్చు?

రాజ్యాంగంలోని ఆర్టికల్ 324(5) ప్రకారం <<19371253>>ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను<<>> తొలగించవచ్చు. ఆర్టికల్ 124(4) ప్రకారం దుష్ప్రవర్తన లేదా అసమర్థత నిరూపితమవ్వాలి. తొలగింపునకు గల కారణాలతో ఓ తీర్మానాన్ని పార్లమెంటులోని ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. LSలో 100, RSలో 50 మంది సభ్యులు సంతకాలు చేసి స్పీకర్/ఛైర్మన్‌కు సమర్పించాలి. దాన్ని వారు అంగీకరిస్తే ఓటింగ్‌లో 2/3 మెజార్టీ రావాలి. ఆ తర్వాత రాష్ట్రపతి కూడా ఆమోదించాలి.
News March 14, 2026
దిగ్గజ క్రికెటర్లకు ప్రతిష్ఠాత్మక అవార్డులు

భారత దిగ్గజ క్రికెటర్లు రోజర్ బిన్నీ, రాహుల్ ద్రవిడ్, మిథాలీ రాజ్‌కు BCCI ప్రతిష్ఠాత్మక అవార్డులను ప్రకటించింది. రేపు ఢిల్లీలో జరిగే నమన్ అవార్డ్స్-2026 ప్రదానోత్సవంలో వీరిని సత్కరించనుంది. ఈ ముగ్గురినీ సీకే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులతో గౌరవించనున్నట్లు ప్రకటించింది. అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్‌లో ప్లేయర్లు కనబరిచిన అసామాన్య ప్రతిభను గుర్తిస్తూ ఏటా నమన్ అవార్డుల ప్రదానం జరుగుతుంది.


