News May 24, 2024
హార్దిక్ పాండ్య, నటాషా విడిపోయారా?

క్రికెటర్ హార్దిక్ – నటాషా దంపతులు విడిపోయారని ప్రచారం జరుగుతోంది. ఆమె ఇన్స్టా ప్రొఫైల్ నేమ్ నుంచి హార్దిక్ పేరు తొలగించడం ఈ రూమర్లకు బలం చేకూరుస్తోంది. అంతేకాక ఇటీవల ఇద్దరూ సింగిల్గా ఉన్న ఫొటోలే తమ అకౌంట్లలో పోస్ట్ చేస్తున్నారు. గతంలో పోస్ట్ చేసిన కపుల్ ఫొటోలు మాత్రం నటాషా తొలగించలేదు. కానీ డివోర్స్ రూమర్లపై ఇరువురూ స్పందించలేదు. 2020 మేలో వీరి వివాహం జరుగగా ఆ ఏడాది జూలైలో అగస్త్య పుట్టాడు.
Similar News
News November 21, 2025
పారిశ్రామికవేత్తలుగా SHG మహిళలకు ప్రోత్సాహం: మంత్రి కొండపల్లి

AP: SHG మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని, సకాలంలో బ్యాంకు రుణాలు అందేవిధంగా చర్యలు చేపట్టాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 39,000 మందికి పైగా మహిళలు రూ.578 కోట్లతో వ్యాపారాలు ప్రారంభించారని, 2026 మార్చి నాటికి SHGలకు రూ.32,322 కోట్ల రుణాలు అందజేయాలన్నారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలను బలోపేతం చేసి, మద్దతు ఇవ్వాలని సూచించారు.
News November 21, 2025
ఇతిహాసాలు క్విజ్ – 73 సమాధానాలు

సమాధానం: పంచ పాండవుల ప్రాణాలు తీసే శక్తి కలిగిన 5 బాణాలను భీష్ముడి నుంచి దుర్యోధనుడు తీసుకుంటాడు. దివ్య దృష్టితో ఈ విషయం తెలుసుకున్న కృష్ణుడికి పూర్వం అర్జునుడికి, దుర్యోధనుడు వరమిచ్చిన విషయం గుర్తుకు వస్తుంది. దీంతో ఆయన అర్జునుడిని, దుర్యోధనుడి వద్దకు పంపి ఆ బాణాలు కావాలనే వరం కోరమని చెబుతాడు. ఇచ్చిన వరం కారణంగా, మాట తప్పకూడదు కాబట్టి దుర్యోధనుడు వాటిని అర్జునుడికి ఇచ్చేస్తాడు. <<-se>>#Ithihasaluquiz<<>>
News November 21, 2025
పదో తరగతి ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

AP: టెన్త్ <


