News March 29, 2024
మంత్రుల నియోజకవర్గంలో గెలుపెవరిదో?

AP: ఉమ్మడి నెల్లూరు(సిటీ, రూరల్) సెగ్మెంట్ మంత్రుల నియోజకవర్గంగా పేరు తెచ్చుకుంది. ఇక్కడ గెలిచిన వారికి మంత్రి పదవి ఖాయమనే ప్రచారముంది. గతంలో సుబ్బారెడ్డి, వెంకట రెడ్డి, రామనారాయణ రెడ్డి, రమేశ్ రెడ్డి, నారాయణ, అనిల్ కుమార్లను మంత్రి పదవులు వరించాయి. ఈసారి నెల్లూరు సిటీలో నారాయణ(TDP), ఖలీల్ అహ్మద్(YCP).. రూరల్లో శ్రీధర్ రెడ్డి(TDP), ప్రభాకర్ రెడ్డి(YCP) పోటీ పడుతున్నారు.
#ELECTIONSPECIALS
Similar News
News December 2, 2025
సీఎంకు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య వినతి

కొత్తగూడెం ఎర్త్ యూనివర్సిటీ ప్రారంభోత్సవానికి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య మంగళవారం కలిసి వినతిపత్రం సమర్పించారు. గిరిజన పోడు రైతులకు పట్టాలు ఇవ్వాలని, కొమరారం, బోడు ప్రాంతాలను మండలాలుగా, చారిత్రక ఇల్లందును రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. సీతారామ ప్రాజెక్టు జలాలను నియోజకవర్గ రైతులకు అందించాలని విజ్ఞప్తి చేశారు.
News December 2, 2025
పగిలిపోయిన దేవతా విగ్రహాలను పూజించవచ్చా?

పగిలిన దేవతా మూర్తుల విగ్రహాలు, చిరిగిన పటాలను ఇంట్లో ఉంచుకోవడం వల్ల భక్తి భావన తగ్గే అవకాశాలు ఉంటాయని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ‘అలాంటి విగ్రహాలు, చిత్రపటాలను పారే నీటిలో నిమజ్జనం చేయాలి. లేకపోతే ఏదైనా దేవాలయం చెట్టు మొదలులో ఉంచాలి. కాగితపు పటాలు అయితే, వాటిని అగ్నికి ఆహుతి చేసి, ఆ బూడిదను నీటిలో కలిపి చెట్ల మొదట్లో పోయడం ఉత్తమ మార్గం’ అని చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>
News December 2, 2025
ఇతిహాసాలు క్విజ్ – 84 సమాధానాలు

ఈరోజు ప్రశ్న: ఐదు ముఖాల రూపం కలిగి, చిరంజీవిగా బ్రహ్మదేవునిచే వరం పొంది, యుద్ధంలో శారీరకంగా పాల్గొనకపోయినా ధర్మసంస్థాపనకు కారణమైంది ఎవరు?
సమాధానం: హనుమంతుడు. ఆయన పంచముఖుడు. చిరంజీవిగా బ్రహ్మదేవుడి వరం పొందాడు. యుద్ధంలో కురుక్షేత్ర యుద్ధంలో ప్రత్యక్షంగా ఆయుధం ధరించి పాల్గొనలేదు. కానీ, పరోక్షంగా, అత్యంత ముఖ్యమైన రీతిలో సహాయం అందించి, ధర్మసంస్థాపనకు కారణమయ్యాడు.
<<-se>>#Ithihasaluquiz<<>>


