News February 23, 2025
ఆ సమయంలో డిప్రెషన్‌కు లోనయ్యా: ఆమిర్ ఖాన్

లాల్‌సింగ్ చడ్ఢా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావటం తనను ఎంతో బాధించిందని ఆమీర్ ఖాన్ అన్నారు. కొంతకాలం పాటు డిప్రెషన్‌కు లోనైనట్లు తెలిపారు. తన చిత్రాలు సరిగ్గా ఆడకపోతే రెండు, మూడు వారాలు డిప్రెషన్‌లో ఉంటానని అనంతరం సినిమా ఫెయిల్యూర్‌కు కారణాలు టీంతో కలిసి చర్చిస్తానని ఆమిర్ పేర్కొన్నారు. 2022లో ఒక హాలీవుడ్ చిత్రానికి రీమేక్‌గా వచ్చిన లాల్‌సింగ్ చడ్ఢా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది.
Similar News
News February 24, 2025
చనిపోయిన 5 నెలలకు హెజ్బొల్లా మాజీ చీఫ్ అంత్యక్రియలు

హెజ్బొల్లా మాజీ చీఫ్ హసన్ నస్రల్లా అంత్యక్రియలు లెబనాన్ రాజధాని బీరూట్‌లో ముగిశాయి. గతేడాది SEPలో ఇజ్రాయెల్ దాడిలో ఆయన మరణించారు. అనంతరం నస్రల్లా వారసుడిగా హెజ్బొల్లా పగ్గాలు చేపట్టిన సఫీద్దీన్ కూడా ఇజ్రాయెల్ దాడిలో చనిపోయారు. వీరిద్దరి అంత్యక్రియలు అప్పట్లోనే తాత్కాలికంగా నిర్వహించారు. తాజాగా అధికారికంగా నిర్వహించిన అంత్యక్రియలకు 65దేశాల నుంచి 800మంది ప్రముఖులు, వేలాదిమంది అభిమానులు తరలివచ్చారు.
News February 24, 2025
శుభ ముహూర్తం(సోమవారం, 24-02-2025)

☛ తిథి: బహుళ ఏకాదశి, ఉ.10.44 వరకు
☛ నక్షత్రం: పూర్వాషాడ, సా.4.44 వరకు
☛ శుభ సమయాలు: ఉ.5.55-ఉ.6.31 వరకు
☛ రాహుకాలం: ఉ.7.30 నుంచి సా.9.00 వరకు
☛ యమగండం: ఉ.10.30 నుంచి మ.12.00 వరకు
☛ దుర్ముహూర్తం: మ.12.24- మ.1.12 వరకు, మ.2.46 నుంచి 3.34 వరకు
☛ వర్జ్యం: రా.12.51 నుంచి 2.28 వరకు
☛ అమృత ఘడియలు: ఉ.11.44-1.23 వరకు
News February 24, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.