News October 24, 2024

పవర్‌లో ఉన్నప్పుడు జగన్ పరామర్శలకు వెళ్లారా?: ఆలపాటి

image

AP: నేరపూరిత ఆలోచనలతో జగన్ ఐదేళ్లు పరిపాలన సాగించారని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర్రప్రసాద్ మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు ఏనాడైనా జగన్ పరామర్శలకు వెళ్లారా? అని ప్రశ్నించారు. ‘వైసీపీ హయాంలో దళితులు, మైనార్టీలు, బీసీలు హత్యకు గురైనప్పుడు జగన్ మాట్లాడలేదు. తాడేపల్లి ప్యాలెస్ పక్కనే జరిగిన అత్యాచారంపై నోరు మెదపలేదు. ఇప్పుడు పరామర్శలు చేస్తూ రాజకీయంగా మాపై బురద చల్లుతున్నారు’ అని దుయ్యబట్టారు.

Similar News

News November 23, 2025

ఒకే వేదికపై కేటీఆర్, కవిత?

image

అన్నాచెల్లెళ్లు కేటీఆర్, కవిత ఒకే వేదికపై కనిపించే అవకాశముంది. ఈ నెల 25న చెన్నైలో ‘ABP నెట్‌వర్క్ సదరన్ రైజింగ్ సమ్మిట్’‌కు హాజరుకావాలని వీరికి ఆహ్వానం అందింది. ఇప్పటికే KTR వెళ్తానని ప్రకటించగా, కవిత కూడా వెళ్లేందుకు సిద్ధమైనట్లు సమాచారం. టైమింగ్స్ ఖరారు కావాల్సి ఉండగా వీరిద్దరూ ఒకే వేదికపై ఎదురుపడతారా అనేది ఆసక్తికరంగా మారింది. BRSను వీడాక కవిత, KTRను ఏ సందర్భంలోనూ కలుసుకోని సంగతి తెలిసిందే.

News November 23, 2025

భారీ జీతంతో 115 ఉద్యోగాలు

image

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 115 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు ఈ నెల 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగాన్ని బట్టి B.Tech, BE, MSc, MCA ఉత్తీర్ణత, వయసు 22-45 ఏళ్లు ఉండాలి. రిజర్వేషన్‌ను బట్టి సడలింపు ఉంటుంది. ఆన్‌లైన్ టెస్టు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. నెలకు జీతం రూ.64,820 నుంచి రూ.1,20,940 వరకు చెల్లిస్తారు.
వెబ్‌సైట్: https://bankofindia.bank.in/

News November 23, 2025

మీకు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్‌లో ఖాతా ఉందా?

image

AP: ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్‌ కీలక ప్రకటన చేసింది. ఖాతాదారుల సౌకర్యార్థం కొత్తగా IFSC కోడ్ UBIN0CG7999ను ఏర్పాటుచేసినట్లు తెలిపింది. దీనిద్వారానే NEFT/RTGS/IMPS/UPI సేవలను కొనసాగించుకోవచ్చని తెలిపింది. కాగా ఈ ఏడాది మే 1 నుంచి ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్, గ్రామీణ వికాస్ బ్యాంక్, సప్తగిరి బ్యాంక్, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకులు విలీనమై ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకుగా అవతరించిన విషయం తెలిసిందే.