News June 9, 2024

కేంద్ర మంత్రివర్గంలోకి జేపీ నడ్డా?

image

బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాను కేంద్ర మంత్రి పదవి వరించబోతున్నట్లు తెలుస్తోంది. అధ్యక్షుడిగా ఆయన పదవీ కాలం ఈ నెలతో ముగియనుంది. మరోసారి అధ్యక్ష పదవి చేపట్టేందుకు నడ్డా ఆసక్తి చూపడం లేదని, దీంతో ఆ పదవి నుంచి తప్పుకోనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఈ క్రమంలో నడ్డాకు మంత్రి పదవి కట్టబెట్టాలని ప్రధాని మోదీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

Similar News

News September 13, 2025

48 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి డబ్బులు: మంత్రి

image

AP: రాష్ట్రంలో ఈ ఏడాది 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని, 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ధాన్యం కొనుగోలు కోసం గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అదనంగా రూ.3,500 కోట్లు ఖర్చు చేయనున్నట్లు పేర్కొన్నారు. సూపర్ ఫైన్ రకం అంచనాలకు మించి మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉందన్నారు. అలాగే రేషన్ బియ్యంలో నాణ్యత పెంచుతామని చెప్పారు.

News September 13, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News September 13, 2025

సెప్టెంబర్ 13: చరిత్రలో ఈ రోజు

image

1913: సినీ నటుడు సీహెచ్ నారాయణరావు జననం
1929: స్వతంత్ర సమరయోధుడు జతీంద్ర నాథ్ దాస్ మరణం
1948: హైదరాబాద్‌లోకి భారత సైన్యం ప్రవేశం
1960: ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి జననం
1960: సినీ నటుడు కార్తీక్ జననం
1965: నటి ముచ్చర్ల అరుణ జననం
1969: ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్ జననం
1989: సినీ రచయిత ఆచార్య ఆత్రేయ మరణం (ఫొటోలో)