News April 26, 2024
మోదీ ఒక్క పరిశ్రమైనా ఇచ్చారా?: సీఎం రేవంత్

TG: దేశాన్ని కార్పొరేట్ వ్యాపారుల చేతిలో పెట్టాలని PM మోదీ ప్రయత్నిస్తున్నారని CM రేవంత్ రెడ్డి ఆరోపించారు. ‘కాంగ్రెస్ హైదరాబాద్‌లో ECIL, BHEL, DRDO వంటి సంస్థలను తీసుకొచ్చింది. ఈ పదేళ్లలో HYDకు మోదీ ఒక్క పరిశ్రమైనా ఇచ్చారా? కాంగ్రెస్ ఇచ్చిన సంస్థలను అంబానీ, అదానీలకు మోదీ అమ్ముతున్నారు’ అని మండిపడ్డారు. ఇక రిజర్వేషన్లు పోవాలనుకుంటే BJPకి, ఉండాలంటే కాంగ్రెస్‌కు ఓటెయ్యాలని రేవంత్ సూచించారు.
Similar News
News January 27, 2026
ప్రాధాన్యత వారీగా ప్రాజెక్టుల పూర్తి: CBN

AP: వెలిగొండ ప్రాజెక్టును ఈ ఏడాదే పూర్తి చేయాలని CM చంద్రబాబు ఆదేశించారు. ‘గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో కొట్టుకుపోయిన అన్నమయ్య ప్రాజెక్ట్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలి. గాలేరు-నగరి ప్రాజెక్టు ద్వారా కృష్ణా నీటిని కడపకు తీసుకెళ్లేలా చూడాలి. 10 జిల్లాల్లోని ఇరిగేషన్ ప్రాజెక్టులను ప్రాధాన్యతల వారీగా పూర్తిచేయాలి’ అని సూచించారు. DP వరల్డ్ సంస్థ(దుబాయ్) ఉద్యాన క్లస్టర్ ఏర్పాటు చేయనుందని తెలిపారు.
News January 27, 2026
EUతో డీల్.. తెలుగు స్టేట్స్‌కు లాభమేంటంటే?

భారత్-EU మధ్య ఫ్రీ <<18973548>>ట్రేడ్ డీల్<<>> జరిగిన విషయం తెలిసిందే. దీంతో యూరప్‌లోని 27 మార్కెట్లు మన ఆంత్రపెన్యూర్స్‌కు అందుబాటులోకి వచ్చాయి. ఓవరాల్‌గా 15 రంగాలకు సంబంధించిన ఎగుమతుల్లో రూ.6.4లక్షల కోట్ల వరకు అదనపు అవకాశాలు దక్కుతాయి. AP నుంచి సీ ఫుడ్, కెమికల్స్, ఫార్మాసూటికల్స్, ఎలక్ట్రానిక్స్.. TG నుంచి టెక్స్‌టైల్స్, ఫార్మాసూటికల్స్, ఎలక్ట్రానిక్స్, ఇంజినీరింగ్ గూడ్స్ రంగాల ఉత్పత్తులకు లబ్ధి చేకూరనుంది.
News January 27, 2026
అరటిలో మెగ్నిషియం లోపం – నివారణ

అరటి మొక్కల్లో మెగ్నీషియం లోపం వల్ల పాత ఆకుల అంచులు పసుపు రంగులోకి మారి, ఆకులపై గోధుమ/ఎరుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. ఆకు ఈనె మధ్య పచ్చగా ఉండి, పక్కలు పసుపు రంగులోకి మారి, చివరికి ఆకులు ఎండి రాలిపోతాయి. ఆకులు, ఆకుల తొడిమలు కురచబారి, మొవ్వులో గుబురుగా ఏర్పడతాయి. చెట్టు ఎదుగుదల నిలిచిపోతుంది. ఈ సమస్య నివారణకు లీటరు నీటికి మెగ్నిషియం సల్ఫేట్ 3గ్రా.లను కలిపి 10 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేయాలి.


