News October 19, 2024

తప్పు చేయలేదు..క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు: సల్మాన్ తండ్రి

image

తన కొడుకు కృష్ణజింకల్ని ఎప్పుడూ చంపలేదని నటుడు సల్మాన్ ఖాన్ తండ్రి సలీమ్ ఖాన్ తెలిపారు. ‘కృ‌ష్ణజింకల్ని కాదు కదా మేమెప్పుడూ బొద్దింకల్ని కూడా చంపలేదు. సల్మాన్‌కు జంతువులంటే చాలా ఇష్టం. తన పెంపుడు కుక్క చనిపోతేనే రోజుల తరబడి ఏడ్చాడు. అలాంటిది కృష్ణజింకల్ని చంపుతాడా? మా కుటుంబం తుపాకీని ఎప్పుడూ వాడలేదు. తప్పే చేయని సల్మాన్ క్షమాపణ ఎందుకు చెబుతాడు? ఆ ప్రసక్తే లేదు’ అని స్పష్టం చేశారు.

Similar News

News November 19, 2025

43 మంది నేతలకు కాంగ్రెస్ షోకాజ్ నోటీసులు

image

బిహార్‌లో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు సహా 43 మంది సీనియర్ నేతలకు కాంగ్రెస్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని వారిపై క్రమశిక్షణ కమిటీ ఈ మేరకు చర్యలు తీసుకుంది. ఈనెల 21 లోగా రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. ఆ లోపు స్పందించకపోతే పార్టీ నుంచి తొలగింపు వంటి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

News November 19, 2025

మూవీ ముచ్చట్లు

image

*రాజమౌళి, మహేశ్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న ‘వారణాసి’ చిత్రం నుంచి ‘రణ కుంభ’ ఆడియో సాంగ్ విడులైంది.
*‘బాహుబలి ది ఎపిక్’ సినిమా జపాన్‌లో రిలీజ్ కానుందని సమాచారం. డిసెంబర్ 12న విడుదల చేస్తారని, 5న ప్రీమియర్‌కు ప్రభాస్‌, నిర్మాత శోభు యార్లగడ్డ హాజరవుతారని తెలుస్తోంది.
*ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ సినిమా విజువల్‌గా, మ్యూజికల్‌గా భారీగా ఉండబోతోంది: మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్

News November 19, 2025

టీమ్ ఇండియా ప్రాక్టీస్‌లో మిస్టరీ స్పిన్నర్‌

image

సౌతాఫ్రికాతో తొలి టెస్టులో స్పిన్నర్ల ధాటికి టీమ్ ఇండియా ఘోరంగా <<18303459>>ఓడిన <<>>సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రొటీస్ బౌలర్లను ఎదుర్కొనేందుకు మిస్టరీ స్పిన్నర్‌ను మేనేజ్‌మెంట్ రంగంలోకి దించింది. ప్రాక్టీస్ సెషన్‌లో స్పిన్నర్ కౌశిక్ మైతీతో బౌలింగ్ చేయించింది. 2 చేతులతో బౌలింగ్ చేయగలగడం కౌశిక్ ప్రత్యేకత. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లకు కుడి చేతితో, రైట్ హ్యాండ్ బ్యాటర్లకు ఎడమ చేతితో బౌలింగ్ వేయగలరు.