News January 27, 2025

చేపల మొప్పల నుంచి మన చెవుల ఆవిర్భావం?

image

మనిషి సహా ఉపరితల జీవుల చెవులు చేపల మొప్పల నుంచి అభివృద్ధి చెందాయని అమెరికా పరిశోధకులు తేల్చారు. ‘మన చెవుల్లో ఉండే జన్యువుల్ని జీబ్రాఫిష్ జినోమ్‌లోకి ప్రవేశపెడితే ఆ చేప మొప్పల్లో మార్పు కనిపించింది. ఇక జీబ్రా ఫిష్ నుంచి జన్యువుల్ని చిట్టెలుకల్లో ప్రయోగించగా వాటి చెవుల్లో మార్పులు కనిపించాయి. పరిణామక్రమంలో చేపల మొప్పలే భూమ్మీద జీవులకు చెవులయ్యాయనేది మా అధ్యయనంలో తేలింది’ అని పేర్కొన్నారు.

Similar News

News March 6, 2026

130+ గంటలుగా ఇరాన్‌ ఆఫ్‌లైన్!

image

ఇజ్రాయెల్-USతో యుద్ధం కొనసాగుతున్న వేళ ఇరాన్‌లో 130+ గంటలుగా ఇంటర్నెట్ నిలిచిపోయింది. 1 % మాత్రమే ఇంటర్నెట్ సేవలు అందుతున్నాయని ఇంటర్నెట్ మానిటరింగ్ గ్రూప్ నెట్ బ్లాక్స్ తెలిపింది. అటు గ్లోబల్ ఇంటర్నెట్ యాక్సెస్ చేసేందుకు ప్రయత్నిస్తున్నవారికి టెలీ కమ్యూనికేషన్ సంస్థలు హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు చెప్పింది. భద్రతాపరమైన కారణాలతో అంతర్గత విషయాలు లీక్ కాకుండా ఇలా చేసినట్లు నిపుణులు చెబుతున్నారు.

News March 6, 2026

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

image

AP: తిరుమలలో ఇవాళ భక్తుల రద్దీ పెరిగింది. టోకెన్ లేనివారికి శ్రీవారి దర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతోంది. వేంకటేశ్వరుడి సర్వదర్శనానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. గురువారం 59,194 మంది శ్రీవారిని దర్శించుకోగా 25,295 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.87 కోట్లు వచ్చినట్లు TTD తెలిపింది.

News March 6, 2026

సూపర్ హీరో మూవీలో సల్మాన్ ఖాన్?

image

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ సూపర్ హీరో కామెడీ సినిమాలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. దర్శక ద్వయం రాజ్ & DK ఆయనకు కథ చెప్పినట్లు సినీవర్గాలు తెలిపాయి. సల్మాన్‌కు స్టోరీ నచ్చిందని, కానీ భారీ బడ్జెట్ వద్దని దర్శకులకు చెప్పారని పేర్కొన్నాయి. రిటైర్ అవ్వాలనుకున్న ప్రతిసారి సమస్యలు ఎదురై యాక్షన్‌లోకి దిగే సూపర్ హీరో పాత్రలో కనిపిస్తారని చెప్పాయి. హాలీవుడ్ మూవీ ‘హాంకాక్’ తరహాలో కథ ఉండొచ్చని వివరించాయి.