News October 5, 2024
రుణమాఫీ హామీని కాంగ్రెస్ నిలబెట్టుకుందా?: మోదీ

మహారాష్ట్రలో పీఎం కిసాన్ నిధుల విడుదల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంపై ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. ‘రైతులకు రుణమాఫీ చేస్తామనే హామీతో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అధికారం చేపట్టి ఇన్ని రోజులైనా ఎందుకు చేయడం లేదని అక్కడి రైతులు ప్రశ్నిస్తున్నారు. మహారాష్ట్ర రైతులు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. మహా వికాస్ అఘాడీ కూటమిని ఓడించాలి’ అని మోదీ పిలుపునిచ్చారు.
Similar News
News March 10, 2026
GREAT: కష్టకాలంలో భారతీయులకు అండగా..

యుద్ధం కారణంగా విమానాలు నిలిచిపోయి దుబాయ్‌లో ఇబ్బంది పడుతున్న భారతీయులకు అండగా నిలిచారు ఇండియన్ బిజినెస్‌మెన్ యోగేష్ దోషి. హోటల్ ఖర్చులను భరించలేని సుమారు 125 మంది ప్రయాణికుల కోసం తన 64 ఫ్లాట్స్ ఉన్న అపార్ట్‌మెంట్ భవనాన్ని కేటాయించారు. వారికి ఉచిత వసతితో పాటు ఆహారం, వైద్య సదుపాయాలను కూడా కల్పించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈయనపై నెట్టింట అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
News March 10, 2026
NITTTRలో ఉద్యోగాలు.. ఈనెల 13 వరకు గడువు

చెన్నైలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ (NITTTR)12 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి డిగ్రీ, డిప్లొమా, టెన్త్ అర్హతతో పాటు పని అనుభవం గలవారు మార్చి 13 వరకు అప్లై చేసుకోవచ్చు. టెక్నికల్ అసిస్టెంట్‌కు గరిష్ఠ వయసు 40ఏళ్లు కాగా.. MTS పోస్టుకు 35ఏళ్లు. వెబ్‌సైట్: https://www.nitttrc.ac.in
News March 10, 2026
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ కోల్పోయిన ఫ్యామిలీ మెంబర్స్ వీళ్లే

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ వ్యక్తిగత జీవితంలో తీరని విషాదం నెలకొంది. ఫిబ్రవరి 28న జరిగిన వైమానిక దాడుల్లో ఆయన కుటుంబం ఛిన్నాభిన్నమైంది. ఆయన తండ్రి అలీ ఖమేనీ, తల్లి మన్సూరే ఖోజస్తే మరణించగా తర్వాతి దాడుల్లో భార్య (జహ్రా హదాద్ అడెల్), ఒక కుమారుడు కూడా ప్రాణాలు కోల్పోయారు. వీరితో పాటు ఒక సోదరి, బావ, ఇద్దరు పిల్లలు సహా మొజ్తబా మొత్తం 8 మంది కుటుంబ సభ్యులను కోల్పోయినట్లు సమాచారం.


