News June 4, 2024
మద్య నిషేధ హామీనే YCP కొంపముంచిందా?
AP: మద్య నిషేధ హమీని పక్కనపెట్టి కొత్త బ్రాండ్లను ప్రవేశపెట్టడమూ YCP ఓటమికి ఓ కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. డబ్బు పెట్టినా తాము కోరుకున్న బ్రాండ్లు దొరకకపోవడంతో మందుబాబులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసినట్లు తెలుస్తోంది. నాణ్యమైన మద్యం ఇవ్వాలని వారు కోరినా ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. తమ ఓటు బ్యాంకులో అసలు మందుబాబులే లేరని సజ్జల కూడా వాదించారు. దీనినే TDP క్యాష్ చేసుకుంది.
Similar News
News November 29, 2024
సోయాబీన్ కొనుగోళ్లలో తొలి స్థానంలో తెలంగాణ
సోయాబీన్ కొనుగోళ్లలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ మొదటి స్థానంలో ఉందని మార్క్ఫెడ్ ఎండీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. తెలంగాణకు ఇచ్చిన నిర్ణీత లక్ష్యంలో 74 శాతం పూర్తయినట్లు చెప్పారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాలు 1-2 శాతమే కొనుగోళ్లు చేశాయని పేర్కొన్నారు. కనీస మద్దతు ధరకు 59,708 టన్నులు కొనుగోలు లక్ష్యం కాగా 43,755 టన్నులు కొనుగోలు చేసినట్లు ప్రకటనలో తెలిపారు.
News November 29, 2024
SSC: 64 వేల మంది మీడియం మార్చుకున్నారు!
AP: టెన్త్ పబ్లిక్ పరీక్షలను <<14665980>>తెలుగు మీడియంలో<<>> రాసేందుకు విద్యాశాఖ అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. దీంతో 64,600 మంది తాము తెలుగులో పరీక్షలు రాస్తామని మీడియంను మార్చుకున్నారు. 5 లక్షల మందికి పైగా విద్యార్థులు ఇంగ్లిష్లోనే ఎగ్జామ్స్ రాయనున్నారు. కొందరు ఉర్దూ, కన్నడ లాంటి ఇతర భాషలనూ ఎంపిక చేసుకున్నారు. ఇప్పటివరకు మొత్తం 6,42,635 మంది వార్షిక పరీక్షల కోసం ఫీజులు చెల్లించారు.
News November 29, 2024
నేడు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ ‘దీక్షా దివస్’
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం కేసీఆర్ 15 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు ఆమరణ నిరాహారదీక్షకు శ్రీకారం చుట్టారు. ఈ విషయాన్ని గుర్తుచేసుకుంటూ బీఆర్ఎస్ ఏటా నవంబర్ 29న దీక్షా దివస్ నిర్వహిస్తోంది. ఇవాళ అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టనుంది. 2009, NOV 29 నుంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వచ్చే వరకూ 11 రోజులపాటు కేసీఆర్ దీక్షను కొనసాగించారు.