News March 2, 2025
రేపు స్కూళ్లకు సెలవు.. మీకు ఇచ్చారా?

TG: MLC ఎన్నికలు జరిగిన ఉమ్మడి మెదక్, కరీంనగర్, ADB, నిజామాబాద్, NLG, WGL, ఖమ్మం జిల్లాల్లో రేపు కౌంటింగ్ సందర్భంగా స్కూళ్లు, కాలేజీలకు సెలవు <<15581975>>ఇవ్వాలని <<>>ప్రభుత్వం ఇటీవల ఆదేశించింది. పలుచోట్ల సెలవు ఇవ్వలేదని విద్యార్థులు, పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. అటు ఏపీలో అవసరమైతేనే సెలవు ఇవ్వాలని EC ఆదేశించింది. దీంతో కౌంటింగ్ జరిగే చోటే సెలవు ఉండే ఛాన్సుంది. మీ స్కూళ్లకు రేపు సెలవు ఇచ్చారా? కామెంట్ చేయండి.
Similar News
News December 3, 2025
ఈ నెల 5న మెగా పేరెంట్స్ డే: డీఈవో

జిల్లా వ్యాప్తంగా 988 ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల 5వ తేదీన మెగా పేరెంట్స్ డే నిర్వహిస్తున్నట్లు డీఈఓ వాసుదేవరావు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థుల అభ్యసన సామర్థ్య పరిశీలన, బోధన విధానాలు, ప్రోగ్రెస్ కార్డులు, ల్యాబ్లు, బోధన సామాగ్రి ప్రదర్శన వంటివి నిర్వహిస్తారు. విద్యార్థుల సామర్థ్యాన్ని తల్లిదండ్రుల సమక్షంలోనే పరిశీలిస్తామని, ప్రజాప్రతినిధులు కూడా పాల్గొంటారని ఆయన వెల్లడించారు.
News December 3, 2025
పిల్లల జీవితానికి ఈ అలవాట్లే పునాదులు

చిన్నతనంలోనే పిల్లలకు కొన్ని అలవాట్లు నేర్పిస్తే వారిలో ప్రశాంతతతోపాటు క్రమశిక్షణ, ఏకాగ్రత, జీవన నైపుణ్యాలు మెరుగవుతాయంటున్నారు నిపుణులు. ఉదయాన్నే త్వరగా నిద్ర లేవడం, బెడ్ సర్దడం, తమంతట తామే రెడీ కావడం, వ్యాయామం, క్లీనింగ్, గార్డెనింగ్ చేయించడం వల్ల వారిలో ఉత్పాదకత పెరుగుతుందని చెబుతున్నారు. వీటితో పాటు పుస్తకాలు చదవడం, కృతజ్ఞతాభావం అలవాటు చేయడం వారికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడతాయంటున్నారు.
News December 3, 2025
19 దేశాలపై మరిన్ని ఆంక్షలు విధించిన ట్రంప్

సిటిజన్షిప్, గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్తోపాటు అన్ని ఇమ్మిగ్రేషన్ అప్లికేషన్ల స్వీకరణను అమెరికా తాత్కాలికంగా నిలిపివేసింది. అఫ్గానిస్థాన్, సోమాలియా సహా 19 నాన్ యూరోపియన్ దేశాలపై ట్రంప్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. నేషనల్ సేఫ్టీ, ప్రజల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. US నేషనల్ గార్డుపై అఫ్గానిస్థాన్ పౌరుడు దాడి చేసిన నేపథ్యంలో అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది.


