News February 6, 2025
మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయా?
TG: రైతు భరోసా పథకం కింద జనవరి 27 నుంచి ఇప్పటి వరకు 21,45,330 మందికి ₹1,126Cr జమ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. నిన్న ఒక్కరోజే ఎకరం లోపు సాగు చేస్తున్న 17.03లక్షల మందికి ₹6K చొప్పున లబ్ధి చేకూర్చినట్లు తెలిపింది. త్వరలోనే 2, 3 ఎకరాల రైతులకు నిధులు జమ చేస్తామంది. కాగా MLC ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ ఆన్గోయింగ్ స్కీమ్ కింద ఈసీ అభ్యంతరం చెప్పలేదని తెలుస్తోంది. మరి మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయా?
Similar News
News February 6, 2025
ఇవాళ జగన్ ప్రెస్ మీట్
AP: వైసీపీ చీఫ్, మాజీ సీఎం జగన్ ఇవాళ ఉదయం 11 గంటలకు మీడియాతో సమావేశం కానున్నారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో ప్రస్తుత పరిణామాలు, పరిస్థితులపై ఆయన మాట్లాడనున్నట్లు తెలుస్తోంది.
News February 6, 2025
నాటోకు జెలెన్స్కీ అల్టిమేటం
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ నాటో, పశ్చిమ దేశాలకు తాజాగా అల్టిమేటం జారీ చేశారు. తమకు అణ్వాయుధాలో లేక నాటోలో సభ్యత్వమో ఏదొకటి త్వరగా తేల్చాలని ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ‘ఓవైపు రష్యా మాపై దూకుడు పెంచుతుంటే మాకెందుకు నాటో సభ్యత్వం ఇవ్వడం లేదు? ఇప్పట్లో నాటో సభ్యత్వం ఇచ్చే ఆలోచన లేకపోతే వెంటనే అణ్వాయుధ క్షిపణుల్నైనా మాకు ఇవ్వాలి. మమ్మల్ని మేం రక్షించుకునేదెలా?’ అని ప్రశ్నించారు.
News February 6, 2025
మహిళల క్రీడల్లో ట్రాన్స్జెండర్లపై నిషేధం.. ట్రంప్ సంతకం
మహిళల క్రీడల్లో ట్రాన్స్జెండర్లు పాల్గొనడాన్ని నిషేధించే ఆదేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా సంతకం చేశారు. మహిళల క్రీడలపై జరుగుతున్న యుద్ధం ఈ ఆదేశాలతో ముగుస్తుందని ఆయన పేర్కొన్నారు. ‘మహిళా అథ్లెట్ల సంప్రదాయాన్ని మేం రక్షిస్తాం. వారి క్రీడల్లోకి పురుషులు ప్రవేశించి, వారిని కొట్టడాన్ని అడ్డుకుంటాం. ఇక నుంచీ స్త్రీల క్రీడలు స్త్రీలకు మాత్రమే’ అని స్పష్టం చేశారు.