News September 19, 2025
కెరీర్‌లో బ్రేక్ వచ్చిందా?

ఉద్యోగంలో విరామం తీసుకుని, మళ్లీ చేరాలనుకుంటున్న మహిళల కోసం పలు కంపెనీలు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నాయి. మహిళా ఇంజినీర్ల కోసం టాటా టెక్నాలజీస్ ‘రీఇగ్నైట్ 2025’, ‘రిటర్న్‌షిప్’ కార్యక్రమాన్ని హెచ్‌సీఎల్ టెక్, మహిళా నిపుణుల కోసం ఇన్ఫీ ‘రీస్టార్ట్ విత్ ఇన్ఫోసిస్’ అనే కార్యక్రమాలు ప్రారంభించాయి. యాక్సెంచర్ ఇండియా ‘కెరీర్ రీబూట్’, విప్రో ‘బిగిన్ ఎగైన్’ కూడా ఇదే కోవలోకి వస్తాయి.
Similar News
News September 20, 2025
H1Bలపై ట్రంప్ షాక్.. ఉద్యోగాలు కష్టమే!

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ H1B వీసాల ఫీజును <<17767574>>లక్ష డాలర్లకు<<>> పెంచడంతో భారతీయులపై తీవ్ర ప్రభావం పడనుంది. అమెరికాలో భారతీయులకు భారీగా ఉద్యోగాలు తగ్గిపోతాయి. అక్కడ MS చదివేందుకు వెళ్లేవారి సంఖ్య కూడా గణనీయంగా తగ్గనుంది. ఇప్పటికే MS పూర్తి చేసిన వారు లక్ష డాలర్ల విలువైన ప్రొడక్టివిటీ అందించగలిగితేనే కంపెనీలు వారిని స్పాన్సర్ చేస్తాయి. దీనివల్ల ఎవరిని పడితే వారిని నియమించుకునేందుకు వీలుండదు.
News September 20, 2025
మైథాలజీ క్విజ్ – 11

1. రామాయణంలో తాటకి భర్త ఎవరు?
2. మహాభారతంలో శంతనుడి మొదటి భార్య ఎవరు?
3. సరస్వతీ దేవి వాహనం ఏంటి?
4. పశుపతినాథ్ దేవాలయం ఏ దేశంలో ఉంది?
5. దీపావళి సందర్భంగా ఏ దేవతను పూజిస్తారు?
<<-se>>#mythologyquiz<<>>
News September 20, 2025
వీటిని ఎక్కువ రోజులు వాడుతున్నారా?

మనం రోజూ వాడే వస్తువులను నిర్దిష్ట సమయంలో మార్చేయాలనే విషయం మీకు తెలుసా? టూత్ బ్రష్‌ను ఎక్కువ కాలం వాడకుండా 3 నెలలకోసారి మార్చడం మేలని నిపుణులు చెబుతున్నారు. అలాగే లోదుస్తులను 6-12 నెలలకు ఓసారి, చీపురుని 1-2 ఏళ్లకోసారి, పరుపుని 7-10ఏళ్లకు ఒకసారి మార్చాలట. దిండును రెండేళ్లకు, సన్‌స్క్రీన్ 12 నెలలకు, కిచెన్ స్పాంజ్‌ను రెండు వారాలకు ఒకసారి మార్చడం శ్రేయస్కరం అని సూచిస్తున్నారు. SHARE IT