News April 11, 2024

‘కల్కి’ సినిమాకు గుమ్మడికాయ కొట్టేశారా?

image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ సినిమాకు గుమ్మడికాయ కొట్టేసినట్లు తెలుస్తోంది. నిన్నటితో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకున్నట్లు సమాచారం. వీఎఫ్ఎక్స్ వర్క్ మాత్రమే పెండింగ్‌లో ఉన్నట్లు టాక్. నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో దీపికా పడుకొణె హీరోయిన్‌గా నటిస్తున్నారు. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సి.అశ్వనీదత్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Similar News

News December 7, 2025

కోహ్లీ అద్భుతంగా బ్యాటింగ్ చేశావ్: స్టెయిన్

image

టీమ్ ఇండియాపై వన్డే సిరీస్ కోల్పోవడం కాస్త నిరుత్సాహ పరిచిందని SA మాజీ పేసర్ డేల్ స్టెయిన్ పేర్కొన్నారు. ‘ఇది ఒక బ్యాడ్ డే. సిరీస్ డిసైడర్‌లో తప్పులకు తావుండకూడదు. టీమ్ ఇండియాకి శుభాకాంక్షలు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ(65*) అద్భుతంగా బ్యాటింగ్ చేశావ్. నేను 20-20 మ్యాచుల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’ అని ట్వీట్ చేశారు. IND-SA మధ్య 5 టీ20ల సిరీస్ డిసెంబర్ 9 నుంచి కటక్ వేదికగా ప్రారంభంకానుంది.

News December 7, 2025

మీ ఇంట్లో ఏడు గుర్రాల చిత్ర పటం ఉందా?

image

పరిగెడుతున్న 7 గుర్రాల చిత్రాన్ని ఇంట్లో ఉంచుకోవడం చాలా శుభప్రదమని వాస్తు నిపుణులు చెబుతున్నారు. దీన్ని ఉత్తర దిశలో ఉంచితే సిరి సంపదలకు లోటుండదని, దక్షిణ దిశలో ఉంచితే చేసే పనుల్లో విజయం లభిస్తుందని అంటున్నారు. ‘ఈ చిత్రం శ్రేయస్సు, విజయాన్ని సూచిస్తుంది. దీన్ని పూజా మందిరంలోనే పెట్టాల్సిన అవసరం లేదు. సూర్య భగవానుడి వాహనం అయిన రథాన్ని ఈ తెలుపు గుర్రాలే లాగుతాయి’ అని వివరిస్తున్నారు.

News December 7, 2025

అర్ధరాత్రి తినే అలవాటు ఎంత ప్రమాదమంటే?

image

అర్ధరాత్రి తినే అలవాటు మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘లేట్ నైట్ తినే అలవాటు మీ నిద్ర, జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తుంది. రాత్రి సమయంలో మీ శరీరం ఫ్యాట్‌ని బర్న్ చేస్తుంది. కానీ, మీరు తినడం వల్ల ఇన్సులిన్‌ ఉత్పత్తి పెరుగుతుంది. అప్పుడు ఫ్యాట్ బర్నింగ్ మోడ్ కాస్తా స్టోరేజ్ మోడ్‌కు వెళ్తుంది. దాంతో మీ శరీరం బరువు పెరుగుతుంది. అధిక బరువు అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది’ అని చెబుతున్నారు.