News January 29, 2025
మీకు తెలుసా.. మహిళలకు 296 పేర్లు!

మహిళలను 296 పేర్లతో మనం పిలవొచ్చు. వాటిలో కొన్ని అంగన, అంబుజవదన, అక్క, అతివ, అబల, అలరుబోడి, ఆడది, ఆడగూతురు, ఇంతి, ఇందువదన, కనకాంగి, కలికి, కాంత, కూచి, కేశిని, కొమ్మ, కోమలాంగి, కోమలి, గరిత, గుబ్బలాడి, గుమ్మ, చెలి, చెలియ, జని, తరుణి, తీయబోడి, తెలిగంటి, నాంచారు, నాతి, నారి, నెచ్చెలి, పడతి, పుత్తడిబొమ్మ, పూబోడి, ప్రియ, బాగులాడి, మగువ, మహిళ, మానిని, ముద్దుగుమ్మ, రమణి, రూపసి, లలన, వధువు, వనిత, సుందరి.
Similar News
News December 8, 2025
మైసూరు పప్పు మాంసాహారమా?

పూజలు, వ్రతాల సమయంలో మైసూరు పప్పు తినకూడదంటారు. దీన్ని మాంసాహారంగా కూడా కొందరు భావిస్తారు. ఇందులో బద్ధకాన్ని కలిగించే తామస గుణాలుండటం అందుకు తొలి కారణం. అలాగే ఓ రాక్షసుడి రక్తం బొట్టు నుంచి ఈ పప్పు పుట్టిందని కొందరు పండితులు పేర్కొంటారు. పాల సముద్రాన్ని చిలకగా వచ్చిన అమృతాన్ని దొంగచాటుగా తాగిన సర్భాను తలను విష్ణు సుదర్శన చక్రంతో ఖండించాడట. ఆ రక్తపు చుక్కలు పడిన చోట ఇవి మొలిచాయని నమ్ముతారు.
News December 8, 2025
ఫైబ్రాయిడ్స్ లక్షణాలివే..

ఫైబ్రాయిడ్స్ ఉన్న మహిళల్లో నెలసరి స్రావంలో రక్తపు గడ్డలు కనిపించడం, నొప్పి ఉంటాయి. ఒకవేళ ఫైబ్రాయిడ్స్ చాలా పెద్దవిగా ఉంటే మూత్రాశయం మీద ఒత్తిడి పడి తరచూ మూత్రవిసర్జన చేయవలసి రావడం, మూత్రవిసర్జన పూర్తిగా జరగకపోవడం, జీర్ణ సమస్యలు వంటివి మొదలవుతాయి. కొన్ని రకాల ఫైబ్రాయిడ్లు గర్భసంచి లోపలి పొరల్లో ఏర్పడతాయి. వీటి వల్ల గర్భస్రావం జరిగిపోవడం, గర్భం దాల్చలేకపోవడం లాంటి సమస్యలు తలెత్తుతాయి.
News December 8, 2025
ఫైబ్రాయిడ్స్ ఎందుకు ఏర్పడతాయంటే?

ఫైబ్రాయిడ్లు ఎందుకు ఏర్పడతాయన్న విషయంలో కచ్చితమైన ఆధారాలు లేకపోయినా, శరీరంలో జరిగే కొన్ని మార్పులు కారణం కావొచ్చంటున్నారు నిపుణులు. ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ వంటి ప్రత్యుత్పత్తి హార్మోన్ల స్థాయుల్లో అసమతుల్యత తలెత్తినప్పుడు ఫైబ్రాయిడ్లు ఏర్పడతాయి. వంశపారంపర్యంగా కూడా ఫైబ్రాయిడ్లు ఏర్పడే అవకాశం ఉందంటున్నారు. పోషకాహార లోపం, చిన్న వయసులోనే రజస్వల అవడం, ఒత్తిడి దీనికి కారణాలంటున్నారు నిపుణులు.


