News March 28, 2025
మీకు తెలుసా?.. రూ.45కోట్ల బడ్జెట్…రూ. లక్ష దాటని కలెక్షన్స్

బాలీవుడ్లో గతేడాది వచ్చిన లేడీ కిల్లర్ చిత్రం రూ.45కోట్ల బడ్జెట్తో తెరకెక్కింది. అర్జున్ కపూర్, భూమి ఫడ్నేకర్ వంటి స్టార్లు నటించారు. ఈమూవీ బాక్సాఫీస్ వద్ద ప్లాఫ్గా నిలిచింది. ఇందులో విషయమేముంది అనుకుంటున్నారా? ఈ మూవీ మెుదటి వారం రూ.1లక్ష కంటే తక్కువే వసూలు చేసిందట. అంతే కాకుండా, కొనుగోలు చేయడానికి OTTలు రాకపోవడంతో నిర్మాణ సంస్థ అధికారిక యూట్యూబ్ ఛానల్లో మూవీని రిలీజ్ చేశారు.
Similar News
News November 4, 2025
CSIR-NIOలో 24 ఉద్యోగాలు

CSIR-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషినోగ్రఫీ(<
News November 4, 2025
నా భార్యను తాళి వేసుకోవద్దనే చెప్తా: రాహుల్

రాహుల్ రవీంద్రన్ తన భార్య, గాయని చిన్మయి శ్రీపాద మంగళసూత్రం ధరించడంపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఇటీవల ‘గర్ల్ ఫ్రెండ్’ మూవీ ప్రమోషన్స్లో రాహుల్ మాట్లాడారు. ‘పెళ్లి తర్వాత మంగళసూత్రం ధరించాలా వద్దా అనేది పూర్తిగా నా భార్య చిన్మయి నిర్ణయం. నేను తాళి వేసుకోవద్దనే చెప్తా. ఎందుకంటే పెళ్లి తర్వాత అమ్మాయిలకు తాళి ఉన్నట్లు అబ్బాయిలకు ఎలాంటి ఆధారం లేదు. ఇది ఒక వివక్ష లాంటిదే’ అని చెప్పారు.
News November 4, 2025
గోళ్లు విరిగిపోతున్నాయా?

గోళ్లు కాస్త పెరగ్గానే పొడిబారి, పెళుసుగా మారి విరిగిపోవడానికి అవి తేమను కోల్పోవడం ఒక కారణం అంటున్నారు నిపుణులు. కాబట్టి నెయిల్స్కు తగినంత తేమను అందించడం చాలా ముఖ్యమంటున్నారు. ఇందుకోసం తగినంత వాటర్ తాగాలి. మాయిశ్చరైజర్ను గోరు మొదలు(క్యుటికల్) చుట్టూ పూసి, చేతులకు కాటన్ గ్లౌజుల్ని ధరించాలి. విటమిన్ ఈ, ఆలివ్ ఆయిల్ రాయడం వల్ల కూడా నెయిల్స్ తిరిగి తేమను పొందుతాయంటున్నారు.


