News February 4, 2025
DC ఓనర్ మన తెలుగు వారేనని తెలుసా?

IPLలోని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఓనర్ కిరణ్ కుమార్ గ్రంధి తండ్రి ఏపీలోని రాజాంకు చెందిన GMR అధినేత గ్రంధి మల్లికార్జునరావు. ప్రస్తుతం కిరణ్ GMR ఎయిర్‌పోర్ట్స్‌కు కార్పొరేట్ ఛైర్మన్‌గా ఉన్నారు. ఢిల్లీ, HYD, గోవా ఎయిర్‌పోర్ట్స్ నిర్మాణ బాధ్యతలు పొందడంలో ఈయనదే కీలక పాత్ర. ఆయన సంపద $3 బిలియన్లకు పైనే. ఎవరూ ఊహించని విధంగా 2025 IPL వేలానికి ముందు పంత్‌ను వదులుకుని ఆయన అందరినీ ఆశ్చర్యపరిచారు.
Similar News
News December 1, 2025
పానీపూరీ కోసం తెరిచిన నోరు మూసుకోలేదు

UP ఔరైయాలో వింత ఘటన జరిగింది. పానీపూరి తినబోయిన మహిళ దవడ డిస్లొకేట్ అయ్యింది. మేనకోడలు డెలివరీ కోసం ఇంకాలా దేవి ఆస్పత్రికి వెళ్లారు. పిల్లలతో కలిసి ఆవిడ కూడా పానీపూరీ తినేందుకు వెళ్లారు. అయితే ఓ పెద్ద పూరీ తినేందుకు ఆమె నోరు తెరవగా అది తిరిగి మూసుకోలేదు. చివరికి వైద్యులు చికిత్స చేసి దానిని సరి చేశారు. సడెన్‌గా, ఏదో పెద్ద ఫుడ్ ఐటమ్ తినేందుకు నోరు తెరవడంతో అలా అయ్యిందని చెప్పారు.
News December 1, 2025
42వేల మంది HIV బాధితులకు పెన్షన్లు: సత్యకుమార్

AP: 2030నాటికి HIV రహిత రాష్ట్రమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ‘HIV పాజిటివిటీ రేటు 0.10 శాతం నుంచి 0.04 శాతానికి తగ్గింది. కొత్త కేసుల్లో ITఉద్యోగులు ఉండటం ఆందోళనకరం. సేఫ్ సెక్స్‌పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. దాదాపు 42వేల మంది HIV బాధితులకు పెన్షన్లు ఇస్తున్నాం. త్వరలో మిగిలిన అర్హులైన వారికీ పెన్షన్ల మంజూరుకు చర్యలు తీసుకుంటున్నాం’ అని తెలిపారు.
News December 1, 2025
అసలేంటీ ‘బ్లాక్ ఫ్రైడే’ ?

1960ల్లో ఫిలడెల్ఫియాలో మొదలైన బ్లాక్ ఫ్రైడే ప్రస్తుతం భారతీయులకు షాపింగ్ ఫెస్టివల్ అయింది. మన క్యాలెండర్, కల్చర్‌లో లేని దానిని గ్లోబలైజేషన్, ఇన్ఫ్లూయెన్సర్లు, సోషల్ మీడియా.. ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్ (FOMO) అంటూ అలవాటు చేసేశాయి. డిస్కౌంట్‌కు నో చెప్పడానికి భారతీయులు ఇష్టపడరు. అదే రూ.వేల కోట్ల వ్యాపారానికి కేంద్రబిందువైంది. గ్లోబల్ బ్రాండ్స్ మొదలెట్టిన ఈ ట్రెండ్‌ను ఇంటర్నెట్ వైరల్ చేసేసింది.


