News February 10, 2025

రంగు మారిన ‘స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ’.. తెలుసా?

image

ప్రపంచ ప్రఖ్యాతి చెందిన అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉన్న ‘స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ’ ఫ్రాన్స్‌లో తయారైంది. స్నేహానికి గుర్తుగా అమెరికాకు ఫ్రాన్స్ గిఫ్ట్‌గా ఇచ్చింది. 1886లో 305 అడుగుల ఎత్తులో రాగితో రూపొందించిన ఈ స్టాచ్యూ ఎర్రటి-గోధుమ రంగులో ఉండేది. కాలక్రమేణా రంగు మారుతూ వచ్చింది. వాతావరణ ప్రతి చర్యలు, ఆక్సీకరణ కారణంగా ఇది ఆకుపచ్చగా మారిపోయింది.

Similar News

News October 14, 2025

E20 వాడకంతో ఆ కార్లలో మైలేజ్ డ్రాప్: సర్వే

image

20శాతం <<17378231>>ఇథనాల్<<>> కలిపిన పెట్రోల్‌ను వాడుతున్న కార్లలో మైలేజ్ తగ్గుతుందని ఓ సర్వేలో తేలింది. మొత్తం 36వేల మంది ఈ సర్వేలో పాల్గొనగా 2022 అంతకుముందు కొన్న కార్లలో ప్రతి 10లో ఎనిమిదింటిలో ఈ ప్రాబ్లమ్ ఉందని పేర్కొంది. ఆగస్టులో ఈ సమస్య 67శాతంగా ఉండగా ప్రస్తుతం 80శాతానికి పెరిగిందని వివరించింది. అంతేకాకుండా 52% వాహనాదారులు ఇంజిన్, ట్యాంక్ ఇతర సమస్యలు ఎదుర్కొంటున్నారని వెల్లడించింది.

News October 14, 2025

సమాన వేతన హక్కు గురించి తెలుసా?

image

స్త్రీ, పురుషులెవరైనా ఒకే రకం పని చేస్తున్నప్పుడు పొందాల్సిన జీతభత్యాలూ ఇద్దరికీ ఒకేవిధంగా ఉండాలని సమాన వేతన చట్టం-1976 చెబుతోంది. పేమెంట్‌లో వ్యత్యాసం చూపడం చట్టవిరుద్ధం. హైరింగ్‌, ప్రమోషన్‌, ట్రైనింగ్‌లో మహిళలపై వివక్షతను తొలగించడానికి ఈ రూల్‌ తీసుకొచ్చారు. ఒక మహిళ తక్కువ వేతనం అందుతున్నట్లు భావిస్తే, ఆమె ప్రైవేట్/ ప్రభుత్వ రంగం.. ఎందులో పనిచేస్తున్నా చట్టబద్ధంగా సవాలు చేయవచ్చు. <<-se>>#womenlaws<<>>

News October 14, 2025

మానవ శరీరంలో అతిపెద్ద అవయవం ఇదే!

image

మానవ శరీరంలో పెద్దలకు 206, నవజాత శిశువుకు 306 ఎముకలుంటాయి. అలాగే ‘కండరాలు- 639, కిడ్నీలు-2, శిశువు దంతాలు- 20, పెద్దల దంతాలు-32, పక్కటెముకలు-24, అతిపెద్ద ధమని- బృహద్ధమని, సాధారణ రక్తపోటు- 120/80 mm hg, రక్త pH- 7.4, చిన్న కండరం- స్టెపిడియస్(6mm), అతిపెద్ద ఎముక- తొడ ఎముక, అతిపెద్ద అవయవం- చర్మం, అతిపెద్ద గ్రంథి- కాలేయం, కణాల అంచనా సంఖ్య- ~ 30 ట్రిలియన్లు, న్యూరాన్ల సగటు సంఖ్య: ~ 86B’ ఉంటాయి.