News October 3, 2025
మేక, గుర్రం గురించి ఈ విషయం మీకు తెలుసా?

మేకలు, గొర్రెలను వేటాడటం ఇతర జంతువులకు అంత ఈజీ కాదు. ఎందుకంటే వాటి కనుపాపలు దీర్ఘ చతురస్రాకారంలో ఉంటాయి. ఇవి 340 డిగ్రీల(మనిషికి 180 డిగ్రీలు) విశాల దృష్టితో చూడగలవు. UC బర్కిలీ పరిశోధకుల ప్రకారం మేకలు తలదించి మేస్తున్నప్పుడు కూడా తల తిప్పకుండా 50డిగ్రీల వరకు పొంచి ఉన్న ప్రమాదాన్ని గుర్తించగలవు. ఇది మేకలు, గొర్రెలు, గుర్రాలు వంటి మేసే జంతువులకు తప్పించుకోవడానికి సహజ రక్షణ వ్యవస్థగా పనిచేస్తోంది.
Similar News
News October 3, 2025
మూడో భార్యకూ విడాకులు ఇవ్వనున్న మాలిక్?

సానియా మీర్జా మాజీ భర్త, పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ తన భార్య సనా జావెద్‌కు విడాకులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఆయనకు ఆమె మూడో భార్య కాగా ఇది మూడో విడాకులు. తొలుత ఆయేషాను పెళ్లాడిన మాలిక్ 8 ఏళ్ల తర్వాత ఆ బంధానికి ముగింపు పలికారు. 2010లో సానియాను పెళ్లాడారు. 13 ఏళ్ల తర్వాత ఆమెకూ విడాకులిచ్చారు. వీరికి ఓ కొడుకు ఉన్నారు. ఇక 2024లో సనాను పెళ్లి చేసుకున్న ఆయన ఏడాదిలోనే విడాకులకు సిద్ధమయ్యారు.
News October 3, 2025
ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకొంటూ ముందుకెళ్లాలి: CBN

AP: MLAలను సమన్వయం చేసుకొంటూ జిల్లాల్లో పార్టీ, ప్రభుత్వాన్ని సమర్థంగా ముందుకు తీసుకెళ్లాలని క్యాబినెట్ భేటీలో CM CBN మంత్రులను ఆదేశించారు. అలాగే కొంతమంది శాసనసభ్యుల గురించి ప్రస్తావన రాగా వారిని నియంత్రించాల్సిన బాధ్యత జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులపై ఉందన్నారు. ఎమ్మెల్యేలు తెలిసో తెలియకో కొన్ని రకాల వ్యాఖ్యలు చేశారని, వారితో మాట్లాడాలని సూచించారు. విపక్షాల విమర్శలను వెంటనే తిప్పికొట్టాలని చెప్పారు.
News October 3, 2025
యుద్ధాన్ని ముగించకపోతే హమాస్‌కు నరకమే: ట్రంప్

ఇజ్రాయెల్‌తో యుద్ధం ముగించాలని హమాస్‌కు US ప్రెసిడెంట్ ట్రంప్ గడువు విధించారు. ఆదివారంలోగా దీనిపై ఒప్పందం చేసుకోకపోతే హమాస్‌కు నరకం అంటే ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. ‘హమాస్ చాలా ఏళ్లుగా మిడిల్ ఈస్ట్‌లో హింసాత్మక ముప్పుగా ఉంది. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌లో మారణహోమం సృష్టించింది. ఆ దాడికి ప్రతీకారంగా ఇప్పటివరకు 25,000+ హమాస్ సైనికులు హతమయ్యారు’ అని ట్రంప్ ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు.