News October 12, 2025

సన్‌ఫ్లవర్ గురించి మీకు ఈ విషయం తెలుసా?

image

పొద్దుతిరుగుడు పువ్వులు అన్నీ సూర్యుడు ప్రకాశించే దిశలో కదులుతూ ఉంటాయని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అయితే అది నిజం కాదట. వాస్తవానికి పొద్దుతిరుగుడు తోటలోని లేత పువ్వులు మాత్రమే సూర్యరశ్మికి అనుగుణంగా తూర్పు నుంచి పడమరకు కదులుతూ ఉంటాయట. పెద్ద పొద్దుతిరుగుడు పువ్వుల పొడవాటి కాండం దృఢంగా ఉండటం వల్ల అవి సూర్యకాంతికి అనుగుణంగా కదలడం కష్టమై.. తూర్పు వైపే తిరిగి ఉంటాయట.

Similar News

News October 12, 2025

అనుబంధాల ఆలయమే పెళ్లి

image

పెళ్లంటే నూరేళ్ల పంట మాత్రమే కాదు. ఏడడుగుల అనుబంధం. ఏడు జన్మల అనురాగం. ఇది రెండు మనసుల పవిత్ర కలయిక. ఇరువురి జీవితాల ప్రేమానురాగాల అల్లిక. తల్లిదండ్రులను మురిపించి, రెండు కుటుంబాల సంతృప్తిని కొనసాగించే గొప్ప సంస్కారం. శాంతి సౌభాగ్యాల ఉద్భవానికి, ‘నా’ అనే తీయని భావనతో కుటుంబాన్ని ఏర్పాటుచేసుకొనే మొదటి సోపానం. ఓర్పు, సహనం అనే పునాదులపై నిర్మితమయ్యే అందమైన అనుబంధాల సౌధమే వివాహం. <<-se>>#Pendli<<>>

News October 12, 2025

బిగ్ బాస్‌-9లోకి దువ్వాడ సన్నిహితురాలు

image

AP ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సన్నిహితురాలు దివ్వెల మాధవి బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీలో రావాలని బిగ్ బాస్ మేనేజ్మెంట్ కోరినట్లు దువ్వాడ చెప్పారు. ‘ఇప్పటివరకు బిగ్ బాస్ ఒక లెక్క. ఈ రోజు నుంచి బిగ్ బాస్ 2.0 చూడబోతున్నారు’ అని అన్నారు. మరి ఒక్కరికే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తారా? అనేది ఇవాళ 9pmకు క్లారిటీ రానుంది. అటు ఈ వారం ఇద్దరు ఎలిమినేటర్ అవుతారని సమాచారం.

News October 12, 2025

3,073 SI పోస్టులు.. దరఖాస్తు చేశారా?

image

SSC 3,073 SI పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తోంది. వీటిలో ఢిల్లీలో 212, CAPF’sలో 2,861 పోస్టులు ఉన్నాయి. ఏదైనా డిగ్రీ అర్హతగల అభ్యర్థులు OCT 16 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 20-25ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి వయోపరిమితిలో సడలింపు ఉంది. రాతపరీక్ష, PST/PET, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. ssc.gov.in/ మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్ కేటగిరీ<<>>కి వెళ్లండి.