News October 4, 2025
మీకు తెలుసా? మెమరీలో మహిళలే బెస్ట్

పురుషులతో పోలిస్తే మహిళల్లో మెమరీ స్కిల్స్ అధికంగా ఉంటాయని పలు అధ్యయనాల్లో తేలింది. ఏవైనా ఘటనలనే కాకుండా కొత్త ముఖాలు, లిస్టులోని వస్తువులు, మాటలను కూడా ఎక్కువకాలం గుర్తుపెట్టుకుంటారు. ముఖ్యంగా మిడిల్ ఏజ్ ఉమెన్స్‌లో ఈ శక్తి అధికంగా ఉంటుంది. అయితే రుతుక్రమం ఆగిపోయిన తర్వాత మెమరీ స్కిల్ క్రమంగా తగ్గినప్పటికీ మగాళ్ల కంటే బెటర్‌గా ఉంటుంది.
Similar News
News October 4, 2025
7న పార్టీ కీలక నేతలతో జగన్ సమావేశం

AP: YCP చీఫ్ జగన్ ఈనెల 7న తాడేపల్లిలో పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంటు పరిశీలకులతో భేటీ అవుతారు. పార్టీ సంస్థాగత నిర్మాణంపై చర్చించే అవకాశం ఉంది. 8న భీమవరంలో EX MLA ప్రసాదరాజు కుమారుడి పెళ్లికి హాజరవుతారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు అడ్డుకొనేందుకు 9వ తేదీన మాకవరపాలెం(M) భీమబోయినపాలేనికి వెళ్తారని పార్టీ పేర్కొంది. అక్కడ నిలిచిపోయిన వైద్య కళాశాలను సందర్శిస్తారు.
News October 4, 2025
పెట్రోల్ కొట్టిస్తున్నారా?.. ఇలా జరిగితే అంతే!

ప్రస్తుతం కేంద్రం తీసుకొచ్చిన E20 పెట్రోల్ చాలా బంకుల్లో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ పెట్రోల్ వాడే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయా బంక్ యాజమాన్యాలు అవగాహన కల్పిస్తున్నాయి. ‘ఇథనాల్ నీటిని వేగంగా ఆకర్షిస్తుంది. వాషింగ్ & వర్షాల సమయంలో ట్యాంకులోకి నీరు చేరకుండా చూసుకోవాలి. నీరు తగిలితే ట్యాంకులో ఓ ప్రత్యేకమైన పొర ఏర్పడి వాహనం స్టార్ట్ కావడం కష్టతరమవుతుంది’ అని హెచ్చరిస్తున్నారు.
News October 4, 2025
స్థానిక ఎన్నికలపై SEC కాల్ సెంటర్

TG: స్థానిక ఎన్నికలకు రెడీగా ఉన్నామని కోర్టుకు నివేదించినందున SEC తన పని తాను చేసుకుంటూ వెళ్తోంది. BC రిజర్వేషన్లపై ఓవైపు హైకోర్టులో కేసు నడుస్తోంది. సుప్రీంకోర్టులోనూ పిటిషన్ దాఖలైంది. అయితే ఎన్నికలకు అనుమతిస్తే అప్పటికప్పుడు ఏర్పాట్లు కష్టమవుతుందనే కొన్ని ముందస్తు చర్యలకు సిద్ధమవుతోంది. ఎన్నికల సమాచారం, ఫిర్యాదులు స్వీకరించేందుకు 92400 21456 నంబర్‌తో తాజాగా కాల్ సెంటర్ ఏర్పాటు చేసింది.