News October 5, 2025

మీకు తెలుసా? మహిళల్లోనే బలమైన ఇమ్యూన్ సిస్టమ్

image

పురుషుల కంటే మహిళల సగటు జీవిత కాలం ఎక్కువని అందరికీ తెలుసు. దీనికి మగాళ్ల శరీరంలో కంటే బలమైన రోగనిరోధక వ్యవస్థలు ఉండటమే కారణమని అధ్యయనాల్లో తేలింది. స్త్రీలలో ఉండే రెండు X క్రోమోజోములతోపాటు ఈస్ట్రోజెన్ హార్మోన్‌లు బ్యాక్టీరియా, వైరస్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తాయి. ఒకరికి జన్మనిచ్చి, సంరక్షించడంలో మహిళలదే కీలకపాత్ర కావడంతో కాలక్రమేణా వారిలో ఇమ్యూన్ సిస్టమ్ అభివృద్ధి చెందినట్లు అంచనా.

Similar News

News October 5, 2025

ఇవాళ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ: IQAir

image

ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ నిలిచినట్లు వాయు నాణ్యతను ట్రాక్ చేసే అంతర్జాతీయ సంస్థ ‘IQAir’ వెల్లడించింది. ఢిల్లీలో గాలి నాణ్యత సూచిక (AQI) స్థాయులు ప్రమాదకరంగా పెరిగినట్లు వెల్లడించింది. ఇవాళ ఏకంగా AQI 167గా ఉందని హెచ్చరించింది. దీనివల్ల పొగమంచు ఏర్పడి ప్రజలు శ్వాస తీసుకోవడానికి కూడా కష్టంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే శీతాకాలంలో ఇలాంటి పరిస్థితులను ఢిల్లీలో చూస్తుంటాం.

News October 5, 2025

సాయంత్రం ఢిల్లీకి కాంగ్రెస్ నేతలు

image

TPCC చీఫ్ మహేశ్ కుమార్ సహా కాంగ్రెస్ నేతలు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్ ఈ సాయంత్రం ఢిల్లీకి వెళ్తున్నారు. BCలకు 42% రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలవడంతో ప్రభుత్వ వాదనలు విన్పించాలని సీనియర్ లాయర్లను వీరు కలవనున్నారు. అటు ఇప్పటికే స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో, రిజర్వేషన్లపై ప్రభుత్వ ఉద్దేశం వివరించి పోలింగ్‌కు మార్గం సుగమం అయ్యేలా చూడాలని సీఎం రేవంత్ వీరికి సూచించారు.

News October 5, 2025

‘కాంతార ఛాప్టర్-1’.. కలెక్షన్లు ఎంతంటే?

image

రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కాంతార ఛాప్టర్-1’ కలెక్షన్లలో దూసుకుపోతోంది. నిన్న రూ.55 కోట్లు కలెక్ట్ చేసినట్లు సినీవర్గాలు వెల్లడించాయి. విడుదలైన మూడు రోజుల్లోనే దేశవ్యాప్తంగా రూ.170 కోట్లకుపైగా గ్రాస్ వసూలు చేసినట్లు తెలిపాయి. ఇవాళ ఆదివారం కావడంతో కలెక్షన్లు మరింత భారీగా పెరిగే అవకాశముంది. రుక్మిణి వసంత్, జయరామ్ ఈ మూవీలో కీలక పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే.