News September 19, 2024
కాసేపట్లో పవన్‌తో బాలినేని, ఉదయభాను భేటీ?

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను మరికాసేపట్లో వైసీపీ మాజీ నేతలు బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను కలవనున్నారు. ఇప్పటికే వీరిద్దరూ తమ అనుచరులతో విజయవాడకు చేరుకున్నారు. పవన్‌తో భేటీ అనంతరం జనసేనలో చేరేదానిపై వీరు స్పష్టత ఇవ్వనున్నట్లు సమాచారం. వీరి బాటలోనే మరికొందరు వైసీపీ నేతలు కూడా జనసేనలో చేరనున్నట్లు తెలుస్తోంది.
Similar News
News September 18, 2025
మైథాలజీ క్విజ్ – 9 సమాధానాలు

1. రాముడికి ‘గంగానది’ ఒడ్డున గుహుడు స్వాగతం పలికాడు.
2. దుర్యోధనుడి భార్య ‘భానుమతి’.
3. ప్రహ్లాదుడు ‘హిరణ్యకశిపుడు’ అనే రాక్షస రాజు కుమారుడు.
4. శివుడి వాహనం పేరు నంది.
5. మొత్తం జ్యోతిర్లింగాలు 12. అవి మల్లికార్జునం, సోమనాథేశ్వరం, మహాకాళేశ్వరం, ఓంకారేశ్వరం, కేదారనాథేశ్వరం, భీమశంకరం, నాగేశ్వరం, ఘృష్ణేశ్వరం, వైద్యనాథేశ్వరం, కాశీ విశ్వేశ్వరం, త్రయంబకేశ్వరం, రామేశ్వరం.<<-se>>#mythologyquiz<<>>
News September 18, 2025
ధ్రువ్ జురెల్ సూపర్ సెంచరీ

ఆస్ట్రేలియా-Aతో లక్నోలో జరుగుతున్న తొలి అనధికార టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో IND-A ప్లేయర్ ధ్రువ్ జురెల్ సూపర్ సెంచరీ(113*) సాధించారు. తన ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 4 సిక్సులున్నాయి. పడిక్కల్(86*), సాయి సుదర్శన్(73), జగదీశన్(64) అర్ధశతకాలతో రాణించారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 4 వికెట్లు కోల్పోయి 403 పరుగులు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన AUS-A 532/6కు డిక్లేర్ చేసింది.
News September 18, 2025
జీఎస్టీ సంస్కరణలపై ధన్యవాద తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం

AP: జీఎస్టీ సంస్కరణలపై ధన్యవాద తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అనంతరం సభ రేపటికి వాయిదా పడింది. కేంద్రం తీసుకొచ్చిన కొత్త పన్నుల విధానంతో ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. పన్నుల విధానంలో 2 శ్లాబులు (5%,18%) మాత్రమే ఉంచి సరళతరం చేశారని పేర్కొన్నారు.