News March 6, 2025
ఇవాళ వే2న్యూస్‌లో ఈ స్టోరీలు చదివారా..?

– కరెంట్ అఫైర్స్ లేటెస్ట్ ఎపిసోడ్
– బాబర్ ఆజమ్‌పై విమర్శలు.. తండ్రి ఆగ్రహం
– YS జగన్‌పై పోలీసులకు ఫిర్యాదు
– సింగర్‌తో BJP MP పెళ్లి.. ఫొటోలు
– ఎగ్జామ్ సిస్టమ్‌ను ఎవరు తయారు చేశారంటే..
– రిటైర్మెంట్‌పై చంద్రబాబు ఏమన్నారంటే
– తమన్నా బ్రేకప్.. కారణమిదే
– తిరుమల అన్న ప్రసాదంలో కొత్తగా..
– ఛాంపియన్స్ ట్రోఫీ: ఈ సారి ఈ పరంపర వద్దు
Similar News
News March 7, 2025
30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ: మంత్రి పొంగులేటి

TG: ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ వరకు 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయాలని క్యాబినెట్ భేటీలో నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. దీని కోసం ప్రత్యేకంగా 90 పోస్టులు మంజూరు చేశామని చెప్పారు. 11 జిల్లాలు, 104 మండలాలు, 1355 గ్రామాలతో HMDAను విస్తరించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. HMDA పరిధిలో కొత్తగా 332 రెవెన్యూ గ్రామాలు ఏర్పాటు చేస్తామన్నారు.
News March 7, 2025
త్వరలో ఉచిత ఆన్‌లైన్ డీఎస్సీ కోచింగ్: మంత్రి

AP: బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో త్వరలో ఉచిత ఆన్‌లైన్ డీఎస్సీ కోచింగ్ ప్రారంభించనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. ఈ నెల 10 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు. BC, EWS అభ్యర్థులు ఈ శిక్షణకు అర్హులని, టెట్‌లో ఉత్తీర్ణులై ఉండాలని పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ జిల్లాలకు చెందిన బీసీ సంక్షేమ శాఖాధికారులను సంప్రదించాలని మంత్రి వివరించారు.
News March 6, 2025
రాజన్న ఆలయంలో దర్గాను తొలగించాలని హుండీలో చీటీలు

తెలంగాణలోని ప్రముఖ వేములవాడ రాజరాజేశ్వర ఆలయ ప్రాంగణంలోని దర్గాను తొలగించాలని కొద్ది రోజులుగా పలు హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో కొందరు భక్తులు ‘దర్గా హఠావో.. వేములవాడ బచావో’ అని చీటీలు రాసి హుండీలో వేశారు. ఆలయ సిబ్బంది వీటిని గమనించి తొలగించారు. కాగా, ఈ దర్గాను రెండు ముస్లిం వర్గాలు నిర్వహిస్తున్నాయి.