News January 11, 2025

‘సంక్రాంతి బంపర్ ఆఫర్.. ఉచిత రీచార్జ్’ అని మెసేజ్ వచ్చిందా?

image

సైబర్ నేరగాళ్లు పండుగ సమయాన్ని తమ మోసాలకు కొత్త ఎత్తుగడగా ఎంచుకున్నట్లు తెలంగాణ పోలీసులు గుర్తించారు. ‘పండుగ సందర్భంగా బంపర్ ఆఫర్ అని ఉచిత రీచార్జ్ అంటూ మెసేజ్‌లు పంపుతారు. వాటిని నమ్మకండి. ఆశపడి క్లిక్ చేయొద్దు. లింక్ మరో 10 మందికి షేర్ చేయకండి. అది రీచార్జ్ కాదు.. మాల్‌వేర్. అత్యాశకు వెళ్లి సైబర్ మోసాలకు గురికావొద్దు’ అని Xలో పోలీసులు ప్రకటన చేశారు.

Similar News

News January 18, 2026

ప్చ్.. రో‘హిట్’ అవ్వలేదు

image

న్యూజిలాండ్‌తో సిరీస్‌లో భారత ఓపెనర్ రోహిత్ శర్మ నిరాశపర్చారు. మూడో వన్డేలో 11 పరుగులే చేసి ఫౌల్క్స్ బౌలింగ్‌లో వెనుదిరిగారు. సిరీస్ మొత్తంగా 61 పరుగులే చేశారు. మరో ఆరు నెలల వరకు వన్డే మ్యాచ్‌లు లేవు. హిట్ మ్యాన్ నుంచి ఆశించిన స్థాయిలో ప్రదర్శన లేకపోవడం ఫ్యాన్స్‌ను నిరాశకు గురిచేస్తోంది. మళ్లీ IPL-2026లోనే రోహిత్ ఆటను చూడవచ్చు. ప్రస్తుతం వన్డేల్లో రోహిత్ 3వ ర్యాంకులో కొనసాగుతున్నారు.

News January 18, 2026

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. ఆరుగురు మావోలు మృతి

image

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఏరివేత కొనసాగుతోంది. నేషనల్ పార్కు ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నిన్న నలుగురు, ఇవాళ ఇద్దరు మావోయిస్టులు మరణించారు. మృతుల్లో నలుగురు మహిళలు ఉన్నారు. ఘటనాస్థలంలో AK-47 సహా 6 తుపాకులు, పేలుడు పదార్థాలను భద్రతాబలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

News January 18, 2026

గర్భనిరోధక మాత్రలతో స్ట్రోక్ ముప్పు

image

అవాంఛిత గర్భాన్ని నిరోధించేందుకు మహిళలు గర్భనిరోధక మాత్రలు వాడుతుంటారు. ఈస్ట్రోజెన్, ప్రొజెస్టోజెన్ హార్మోన్లు కలిసి ఉన్న మాత్రలు వినియోగించే మహిళలకు క్రిప్టోజెనిక్ స్ట్రోక్‌ ముప్పు ఎక్కువని పరిశోధకులు గుర్తించారు. మెదడుకు రక్త ప్రవాహం జరిగే మార్గంలో రక్తం గడ్డకట్టడం వల్ల క్రిప్టోజెనిక్ స్ట్రోక్‌ వస్తుంది. మహిళలకు వస్తున్న స్ట్రోక్‌లలో దాదాపు 40% క్రిప్టోజెనిక్ ఐషెమిక్ స్ట్రో‌క్‌లేనని తెలిపారు.