News August 13, 2024

వారికి డబ్బు పంపారా.. IT నిఘా పెట్టింది

image

విదేశాలకు రూ.6L మించి పంపిన లావాదేవీలపై CBDT నిఘా పెంచింది. 2016 నుంచి దాఖలైన ఫామ్ 15CCలను క్షణ్ణంగా పరిశీలించి, పన్ను ఎగవేతలను గుర్తించి నోటీసులు పంపాలని అధికారుల్ని ఆదేశించింది. రూ.5L వార్షిక ఆదాయాన్ని డిక్లేర్ చేసిన కొందరు గత మూడేళ్లలో ముగ్గురు ఏజెంట్ల ద్వారా రూ.15L పంపడాన్ని గమనించినట్టు తెలిపింది. విద్య, వైద్యం మినహా రూ.7 లక్షలకు మించి విదేశాలకు పంపిస్తే కేంద్రం 20% TCS వసూలు చేస్తోంది.

Similar News

News November 27, 2025

మేడ్చల్ జిల్లాకు కాంగ్రెస్ ప్రెసిడెంట్‌గా చేసింది వీరే!

image

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు నూతన DCC అధ్యక్షుడిగా తోటకూర వజ్రేష్ యాదవ్ నియమితులయ్యారు. గతంలో సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి అధ్యక్షుడిగా బాధ్యతలను నిర్వర్తించారు. అంతకు ముందు అధ్యక్షుడిగా ఉన్న నందికంటి శ్రీధర్ ప్రస్తుతం BRSలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వజ్రేష్ గతంలో మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా వ్యవహరించారు.

రాజధాని రైతులకు న్యాయం చేయడం నా బాధ్యత: చంద్రబాబు

image

AP: అమరావతిని రాజధానిగా గుర్తించాలని కేంద్రాన్ని కోరామని CM చంద్రబాబు తెలిపారు. రాజధాని రైతులకు క్యాపిటల్ గెయిన్స్ గడువును పొడిగించే అంశంపై కేంద్రంతో మాట్లాడతామని చెప్పారు. ‘అమరావతి అభివృద్ధి చెందాలి. ఈ ఫలాలను ఇక్కడి రైతులే ముందు అందుకోవాలి. వారికి న్యాయం చేయడం నా బాధ్యత. రెండో విడత ల్యాండ్ పూలింగ్‌లో భూములు తీసుకుని అభివృద్ధి చేద్దామని చూస్తున్నాం’ అని రాజధాని రైతులతో మీటింగ్‌లో పేర్కొన్నారు.