News December 15, 2024
ట్రైన్లో నుంచి మీ వస్తువు పడిపోయిందా.. వెంటనే ఇలా చేయండి?

రైలులో నుంచి మీ వస్తువులు ఏవైనా కిందపడిపోతే వెంటనే చైన్ లాగకూడదు. ఆ వస్తువు పడిన దగ్గర్లోని పసుపు, ఆకుపచ్చ రంగులో ఉన్న పోల్ నంబర్ నోట్ చేసుకోవాలి. ఆ వెంటనే టీసీని సంప్రదించి పోల్ నంబర్, ముందూ వెనుక ఉండే రైల్వే స్టేషన్ల నంబర్లు టీసీ, ఆర్పీఎఫ్ అధికారులకు చెప్పాలి. లేదంటే 182 లేదా 139కు కాల్ చేసి తెలపాలి. పోల్ నంబర్ ఆధారంగా పోయిన మీ వస్తువును వారు వెతికి తీసుకువచ్చి అప్పగిస్తారు.
Similar News
News December 21, 2025
ఎద్దు తన్నునని గుర్రంచాటున దాగినట్లు

ఎవరైనా ఎద్దు పొడుస్తుందని లేదా తన్నుతుందని భయపడి, దాని నుంచి రక్షణ కోసం వెళ్లి గుర్రం వెనుక దాక్కుంటే అంత కంటే పెద్ద ప్రమాదం ఉండదు. ఎందుకంటే ఎద్దు కంటే గుర్రం మరింత వేగంగా, బలంగా తన్నుతుంది. అంటే ఎవరైనా వ్యక్తి ఒక చిన్న కష్టం నుంచి బయటపడాలని చూస్తూ, తనకు తెలియకుండానే అంతకంటే భయంకరమైన చిక్కుల్లో పడినప్పుడు ఈ సామెతను ఉపయోగిస్తారు.
News December 21, 2025
కుటుంబ కలహాలతో ఇబ్బంది పడుతున్నారా?

అకారణంగా మీ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయా? భాగస్వామితో మనస్పర్థలున్నాయా? దీనివల్ల ప్రశాంతత కరవవుతోందా? దీనికి గ్రహ గతులు సరిగా లేకపోవడం, వాస్తు దోషాలే కారణమవ్వొచ్చు! దీని నివారణకు రోజూ ఉదయం, సాయంత్రం ఇంట్లో దీపారాధన చేయాలి. సత్యనారాయణ స్వామి వ్రతం శుభాన్నిస్తుంది. సోమవారాలు శివాలయానికి వెళ్లడం మంచిది. అభిషేకంతో అధిక ఫలితముంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరిగి, ఇల్లు ఆనందమయంగా మారుతుంది.
News December 21, 2025
నేడే ఫైనల్.. వీళ్లు చెలరేగితే విజయం ఖాయం!

అండర్-19 ఆసియా కప్ వన్డే టోర్నీ ఆఖరి మజిలీకి చేరుకుంది. టీమ్ ఇండియా యంగ్స్టర్స్ నేడు దాయాది దేశంతో తలపడనున్నారు. ఇవాళ సూర్యవంశీ, అభిజ్ఞాన్ కుందు మరోసారి చెలరేగితే భారత్కు విజయం సునాయాసం అవుతుంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు టీమ్ ఇండియా అన్ని గ్రూప్ మ్యాచుల్లో గెలిచింది. సెమీస్లో అయితే శ్రీలంకపై 8 వికెట్ల తేడాతో ఘన విజయం నమోదు చేసింది. ఇప్పటికే పాక్ను ఒకసారి 90 రన్స్ తేడాతో ఓడించింది.


